ఓరినాయనో.. భార్యను చంపడానికి ముందు ప్రాక్టీస్ కోసం.. గురుమూర్తి ఇంకో ఘాతుకం

సాధారణంగా ఏ క్లిష్టమైన పనైనా చేయాలనుకుంటే మనం ముందుగా ప్రాక్టీస్‌ చేస్తాం.

ఓరినాయనో.. భార్యను చంపడానికి ముందు ప్రాక్టీస్ కోసం.. గురుమూర్తి ఇంకో ఘాతుకం

Gurumurthy, Venkata Madhavi

Updated On : January 23, 2025 / 7:51 PM IST

హైదరాబాద్‌లోని మీర్‌పేటలో గురుమూర్తి అనే వ్యక్తి తన భార్యను చంపేసి, మృతదేహాన్ని ముక్కలు చేసి, ఉడికించిన ఘటనలో మరో సంచలన విషయం బయటకు వచ్చింది. సాధారణంగా ఏ క్లిష్టమైన పనైనా చేయాలనుకుంటే మనం ప్రాక్టీస్‌ చేస్తాం.

అలాగే, భార్యను చంపే ముందు భర్త గురుమూర్తి కూడా ప్రాక్టీస్ చేశాడట. భార్యను చంపడానికి ముందు అతడు ప్రాక్టీస్ కోసం కుక్కను చంపినట్లు తెలుస్తోంది. కుక్కను చంపగా వచ్చిన అనుభవంతో భార్యను చంపి ముక్కలు ముక్కలుగా చేసినట్లు సమాచారం.

ఈ నెల 15న జిల్లెలగూడలోని ఇంట్లో భార్య మాధవిని గురుమూర్తి హత్య చేశాడు. బిల్డింగ్‌లో ఎవరూలేని సమయంలో దారుణానికి ఒడిగట్టాడు గురుమూర్తి. సంక్రాంతికి అందరూ ఊరికి వెళ్లిన తర్వాత మాధవిని చంపాలని నిర్ణయించుకున్నాడు.

తన భార్య వెంకట మాధవిని చంపి, ఆమె ఆనవాళ్లు లేకుండా చేయాలనుకున్నాడు. మటన్ కొట్టే కత్తితో మృతదేహాన్ని ముక్కలుగా నరికాడు. ఎముకల నుంచి మాంసాన్ని వేరుచేసి కుక్కర్లో ఉడికించాడు. ఎముకలను కాల్చి దంచి పొడి చేశాడు. వీటన్నింటినీ కవర్లలో కట్టి డ్రైనేజీల్లో, చెరువులో పడేశాడు.

కాగా, దర్యాప్తు జరుపుతున్న పోలీసులు గురుమూర్తి సెల్‌ఫోన్‌ స్వాధీనం చేసుకున్నారు. అతడి స్మార్ట్‌ఫోన్‌లో ఓ మహిళ ఫొటోలను గుర్తించారు. ఆమెతో సన్నిహిత సంబంధం కారణంగానే భార్యను గురుమూర్తి అడ్డు తొలగించుకునేందుకు చంపి ఉండొడని పోలీసులు అనుమానిస్తున్నారు.

Meerpet Madhavi Case : మీర్ పేట్ మాధవి కేసులో మరో సంచలనం..! హత్యకు అసలు కారణం అదేనా?