Meerpet Madhavi Case : మీర్ పేట్ మాధవి కేసులో మరో సంచలనం..! హత్యకు అసలు కారణం అదేనా?
మర్డర్ జరిగిన విధానంపైనా కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

Meerpet Madhavi Case : మీర్ పేట్ మహిళ దారుణ హత్య కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటివరకు భార్య, భర్తల మధ్య గొడవలే హత్యకు కారణమని ప్రచారం జరగ్గా.. ఇప్పుడు కొత్త క్యారెక్టర్ ఈ స్టోరీలోకి ఎంటర్ ఇచ్చింది. భార్యపై అనుమానంతో గురుమూర్తి హత్య చేశాడని అంతా భావించగా.. గురుమూర్తికి మరో మహిళతో సంబంధం ఉన్నట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటు మర్డర్ జరిగిన విధానంపైనా కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
భార్య వెంకట మాధవిని క్రూరంగా చంపి, ముక్కలుగా నరికి, కుక్కర్ లో ఉడికించాడని, ఎముకలను పొడిగా చేసి కాలువలో పడేశాడని జరిగిన ప్రచారంలో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. మాధవి డెడ్ బాడీ ముక్కలుగా చేసి కుక్కర్ లో కాకుండా బకెట్ లో పెట్టి వాటర్ హీటర్ తో ఉడికించినట్లు కొత్త అనుమానాలు కలుగుతున్నాయి. ఈ కేసులో దర్యాఫ్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.
Also Read : 3 లక్షలు లంచం ఇచ్చినా కేసు ఎందుకు పెట్టావ్? సీఐతో వ్యక్తి వాగ్వాదం.. ఆడియో వైరల్
ఈ కేసులో ఎలాంటి ఆధారాలు లభించలేదని, సీసీ ఫుటేజీ ఆధారంగా దర్యాఫ్తు చేస్తున్నట్లు సీఐ నాగరాజు వెల్లడించారు. మాధవి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు హత్య కోణంలోనూ దర్యాఫ్తు చేస్తున్నామని, మృతదేహాన్ని ముక్కలు చేసి చెరువులో పడేసినట్లు ఆధారాలు లభించలేదన్నారు. మాధవి ఇంట్లోకి వెళ్లినట్లు మాత్రమే సీసీ ఫుటేజ్ లో కనిపించిందని, ఇంటి నుంచి బయటకు వచ్చిన సీసీ ఫుటేజ్ దృశ్యాలు లేవన్నారు. భర్తే హత్య చేసినట్లు మాధవి కుటుంబసభ్యులు అనుమానిస్తున్నారన్నారు. సైంటిఫిక్ ఎవిడెన్స్ ఆధారంగా కేసు దర్యాఫ్తు చేస్తున్నట్లు సీఐ నాగరాజు తెలిపారు.
ఇప్పటికే గురుమూర్తి కాల్ డేటాను చెక్ చేసిన పోలీసులు.. గురుమూర్తికి ఎవరితోనైనా వివాహేతర సంబంధాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో ఆరా తీస్తున్నారు. ఆధారాలు దొరక్కుండా భార్య మాధవిని హత్య చేసినట్లు ఆరోపణలు రావడంతో గురుమూర్తిని వివిధ కోణాల్లో ప్రశ్నిస్తున్నారు పోలీసులు. మాధవి డెడ్ బాడీ బూడిద ఆధారాల కోసం పోలీసులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.