అమ్మ ఎక్కడ నాన్న అని పిల్లలు అడిగితే.. గురుమూర్తి సమాధానం ఇదే..
నిందితుడు గురుమూర్తి పిల్లలు ఇచ్చిన స్టేట్మెంట్ వివరాల ప్రకారం.. పండుగ తరువాత ఇంటికి రాగానే ఇంట్లో దుర్వాసన వచ్చిందని ..

Hyderabad Ex Jawan Gurumurthy Case
హైదరాబాద్ లోని మీర్ పేట్ లో రిటైర్డ్ ఆర్మీ జవాన్ గురుమూర్తి తన భార్యను దారుణంగా హత్యచేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో నిందితుడు గురుమూర్తిని పోలీసులు విచారిస్తున్నారు. ఈ క్రమంలో హత్యకేసుకు సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నారు. వివాహేతర సంబంధానికి అడ్డుగా వస్తుందని భావించి భార్యను గురుమూర్తి చంపినట్లుగా దర్యాప్తులో పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఇదిలాఉంటే.. గురుమూర్తి పిల్లల స్టేట్ మెంట్ ను పోలీసులు రికార్డు చేశారు.
గురుమూర్తి పిల్లలు ఇచ్చిన స్టేట్మెంట్ వివరాల ప్రకారం.. పండుగ తరువాత ఇంటికి రాగానే దుర్వాసన వచ్చిందని గురుమూర్తి కుమార్తె పోలీసులకు తెలిపింది. ఇంటికి రాగానే ‘‘అమ్మ ఎక్కడ నాన్న అని అడిగా.. కానీ, నాన్న మౌనంగా ఉన్నాడు. ఏమీ చెప్పలేదు’’ అని పోలీసులకు ఇచ్చిన స్టేట్ మెంట్ లో గురుమూర్తి కుమార్తె పేర్కొంది. ఇదిలాఉంటే. మాధవి హత్య చేశానని పోలీసుల ముందు గురుమూర్తి ఒప్పుకున్న విషయం తెలిసిందే. అయితే, ఆమెను చంపిన విధానంపై పోలీసులకు రెండు మూడు వెర్షన్స్ లో గురుమూర్తి చెబుతున్నట్లు తెలిసింది.
Also Read: Kothagudem: ఖాకీ పోస్టింగ్.. ఖద్దర్ ఫైటింగ్.. పుణ్యక్షేత్రం సాక్షిగా పైరవీల ఫైట్ నడుస్తోందా?
ఇంట్లోని బాత్ రూమ్ లోనే మాధవి మృతదేహాన్ని కత్తితో ముక్కలు ముక్కలు చేశానని, రక్తపు మరకలు కనిపించకుండా పది సార్లు కడిగినట్లు గురుమూర్తి చెప్పాడు. అయితే, గురుమూర్తి పొంతనలేని సమాధానాలతో పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. గురువారం రాత్రి గురుమూర్తిని మరోసారి ఎముకల పొడిని కలిపిన చెరువు దగ్గరికి తీసుకెళ్లారు. అయినా ఎలాంటి ఆనవాళ్లు లభ్యం కాలేదు.
నిందితుడు గురుమూర్తిని మీర్ పేట్ పోలీసులు ఇవాళ కోర్టులో హాజరుపర్చనున్నారు. ఇప్పటికే పోలీసులు రెండుసార్లు సీన్ రీ కనస్ట్రక్షన్ చేశారు. కోర్టులో హాజరుపర్చి తిరిగి కస్టడీలోకి తీసుకున్న తరువాత మరోసారి సీన్ రీకనస్ట్రక్షన్ ను చేయనున్నారు పోలీసులు. ఇప్పటికే కీలకమైన ఆధారాలను సేకరించి అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. సుమారు మూడు గంటలపాటు గురుమూర్తి ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో క్లూస్ టీమ్ కీలకమైన ఆధారాలను సేకరించినట్లు తెలుస్తోంది. ఈ ఆధారాల ప్రకారం చనిపోయింది మాధవినే అని నిర్ధారించేలా పోలీసులు దృష్టిసారించారు.