Kalvakuntla Kavitha: పేరు మార్చే ప్రసక్తే లేదు.. వందల పార్టీలకు లేని అభ్యంతరాలు మాకేనా? ఈసీకి కవిత స్ట్రాంగ్ కౌంటర్

తెలంగాణ రక్షణ సేన పార్టీ రిజిస్ట్రేషన్‌ను తక్షణమే ఆమోదించి, గుర్తింపు ఇవ్వాలని పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత(Kalvakuntla Kavitha) కోరారు.

Kalvakuntla Kavitha counter to Election Commission regarding the name change of Telangana Rakshana Sena party

  • కొత్త పార్టీ గుర్తింపు రచ్చ
  • ఈసీకి కవిత ఘాటు లేఖ
  • పేరు మార్పుపై తీవ్ర అభ్యంతరం

Kalvakuntla Kavitha: తెలంగాణ రక్షణ సేన పార్టీ రిజిస్ట్రేషన్‌ను తక్షణమే ఆమోదించి, గుర్తింపు ఇవ్వాలని పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత(Kalvakuntla Kavitha), ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు ప్రజాప్రాతినిధ్య చట్టం, 1951 లోని సెక్షన్ 29A కింద తమ దరఖాస్తును నిష్పాక్షికంగా పరిశీలించాలని కోరుతూ సుదీర్ఘ లేఖ ద్వారా ఈసీకి సమాధానమిచ్చారు. దేశంలో ఒకే రకమైన పేర్లతో వందలాది పార్టీలు ఉన్నప్పుడు, కేవలం తమ పార్టీ విషయంలోనే అభ్యంతరాలు వ్యక్తం చేయడం సరికాదని వారు స్పష్టం చేశారు.

Ismail Returns Money: నిజాయితీ అంటే ఇదే.. అప్పుగా వెయ్యి తీసుకున్నాడు. 35 ఏళ్ళ తరువాత వడ్డీతో సహా చెల్లించాడు..

వెయ్యి అభ్యంతరాల కాపీలు ఇవ్వాలని డిమాండ్:

తమ పార్టీ రిజిస్ట్రేషన్‌పై సుమారు వెయ్యి అభ్యంతరాలు వచ్చాయని జూన్ 23న ఎన్నికల సంఘం లేఖ రాసిందని, అయితే వాటిలో ఒక్క కాపీని కూడా తమకు పంపలేదని ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ పేర్కొన్నారు. అభ్యంతరాలు ఎవరు వ్యక్తం చేశారో, అందులో ఏముందో తెలియకుండా సమాధానం ఎలా చెప్పగలమని ప్రశ్నించారు. తెలంగాణలో మూడున్నర కోట్ల జనాభా ఉంటే, కేవలం 1,000 అభ్యంతరాలను చూపించి రిజిస్ట్రేషన్ ఆపడం హేతుబద్ధం కాదన్నారు. ఢిల్లీ హైకోర్టు ఆదేశాల ప్రకారం వ్యక్తిగత విచారణకు హాజరయ్యే ముందే ఆ అభ్యంతరాల కాపీలన్నీ తమకు అందజేయాలని డిమాండ్ చేశారు.

పేరు మార్పు కుదరదు.. తీవ్ర నష్టం:

ఈ ఏడాది ఏప్రిల్ 28న ఈసీ అధికారికంగా తమకు పేరు కేటాయించిందని, ఆ నమ్మకంతో ఇప్పటికే 105 నియోజకవర్గాల్లో పార్టీ జెండాలను ఆవిష్కరించి సంస్థాగత నిర్మాణం పూర్తి చేసుకున్నామని తెలిపారు. ఇప్పుడు అకస్మాత్తుగా పేరు మార్చుకోవాలని చెబితే తీవ్ర నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈసీ ప్రస్తావిస్తున్న తెలంగాణ రక్షణ సమితి (డెమోక్రాటిక్), తెలంగాణ రాజ్య సమితి వంటి పార్టీలతో తమకు ఎలాంటి పోలిక లేదన్నారు. దేశంలో ఆమ్ ఆద్మీ, జన్ అధికార్ వంటి ఒకే తరహా పదాలతో వందలాది పార్టీలు ఉన్నందున, ఊహాజనిత అభ్యంతరాలను తిరస్కరించాలని కోరారు.