Ismail Returns Money: నిజాయితీ అంటే ఇదే.. అప్పుగా వెయ్యి తీసుకున్నాడు. 35 ఏళ్ళ తరువాత వడ్డీతో సహా చెల్లించాడు..
స్నేహితుడికి ఇచ్చిన మాటను గుర్తుపెట్టుకున్న ఇస్మాయిల్(Ismail Returns Money) 35 ఏళ్ల తర్వాత రూ. 25,000లను లచ్చన్న కుటుంబానికి అందజేశాడు.
Ismail repaid a loan of one thousand rupees along with interest after 35 years
- నాడు వెయ్యి రూపాయల అప్పు
- ముప్పై ఐదేళ్ల సుదీర్ఘ అన్వేషణ
- వడ్డీతో కలిపి ఇరవైఐదు వేలు
Ismail Returns Money: స్నేహంలో నిజాయితీకి, ఇచ్చిన మాటపై నిలబడే తత్వానికి అద్దం పట్టే ఓ అరుదైన ఘటన తెలంగాణలో వెలుగుచూసింది. కేరళకు చెందిన ఇస్మాయిల్ 1991లో సౌదీ అరేబియాలో పనిచేస్తున్నప్పుడు, తన గది భాగస్వామి, జగిత్యాల జిల్లా ధర్మపురికి చెందిన లచ్చన్న వద్ద 120 సౌదీ రియాల్స్ అంటే అక్షరాలా వెయ్యి రూపాయలు అప్పుగా తీసుకున్నాడు. ఆ తర్వాత లచ్చన్న స్వదేశానికి తిరిగి రావడం, అప్పట్లో మొబైల్ ఫోన్లు లేకపోవడంతో వీరి మధ్య పరిచయం పూర్తిగా తెగిపోయింది.
TG-TET Results 2026: తెలంగాణ టెట్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. రేపే TG TET ఫలితాల విడుదల
అయినప్పటికీ, స్నేహితుడికి ఇచ్చిన మాటను గుర్తుపెట్టుకున్న ఇస్మాయిల్(Ismail Returns Money), 35 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఆన్లైన్ సాయంతో లచ్చన్న సొంతూరు ధర్మపురిని కనుగొన్నాడు. జూలై 9న నేరుగా అతడి ఇంటికి చేరుకోగా, లచ్చన్న ప్రస్తుతం మళ్లీ గల్ఫ్‌లోనే ఉన్నట్లు తెలిసింది. దాంతో కుటుంబ సభ్యుల ద్వారా వాట్సాప్ కాల్లో స్నేహితుడితో మాట్లాడిన ఇస్మాయిల్, నాడు తీసుకున్న వెయ్యి రూపాయలకు వడ్డీ కలిపి మొత్తం రూ. 25,000లను లచ్చన్న కుటుంబానికి అందజేశాడు. ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా నిజాయితీతో వెతుక్కుంటూ వచ్చి డబ్బు తిరిగి ఇచ్చిన ఇస్మాయిల్ గొప్ప మనసును లచ్చన్న ప్రశంసించాడు.
