Kalvakuntla Kavitha
Kalvakuntla Kavitha: తెలంగాణలో పొలిటికల్ వ్యాక్యూమ్ ఉందని “జాగృతి” అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. రాజకీయ పార్టీపై తాను ఇప్పుడే నిర్ణయం తీసుకోలేనని, ఇంకా తాను ప్రజల్లో తిరగాలని చెప్పారు.
తన జనంబాట కార్యక్రమంలో.. పార్టీ పెట్టాలన్న డిమాండ్ మహిళల నుంచి ఎక్కువగా వస్తుందని కవిత తెలిపారు. “కొత్త పార్టీదేముంది.. ఎప్పుడైనా పెట్టొచ్చు. కానీ, ప్రజల సమస్యలు తీర్చేలా కొత్త పార్టీ ఉండాలి. కేసీఆర్‌తో టచ్‌లో ఉన్నానా అనే ప్రశ్న ఉత్పన్నం కాదు. (Kalvakuntla Kavitha)
ప్రజల నుంచి వస్తోన్న ఫీడ్ బ్యాక్ ఆధారంగానే నేను ఆరోపణలు చేస్తున్నాను. 27 మున్సిపాలిటీల విలీనం వెనుక పెద్ద స్కాం ఉంది. ఎమ్మెల్సీ పదవికి నేను చేసిన రాజీనామాకు ఇంకా ఆమోదం తెలపలేదు. ప్రజాప్రతినిధిగా సినిమాల పైరసీకి నేను వ్యతిరేకం” అని అన్నారు.
కాగా, కవిత కొత్త పార్టీ పెడతారని కొన్ని నెలలుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. అలాగే, ఐబొమ్మ నిర్వాహకుడు రవిని అరెస్టు చేయడంతో పైరసీపై చర్చ జరుగుతోంది. మరోవైపు, ఔటర్ రింగ్ రోడ్‌ను ఆనుకుని ఉన్న 27 అర్బన్ లోకల్ బాడీలను (మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు) జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని తెలంగాణ క్యాబినెట్ నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే కవిత ఆయా విషయాలపై స్పందించారు.