పెద్దల సభకు కల్వకుంట్ల కవిత, ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం

  • Publish Date - October 29, 2020 / 08:18 AM IST

 Kalvakuntla Kavitha To Take Oath As MLC : పెద్దల సభలోకి కల్వకుంట్ల కవిత ఎంటర్ కానున్నారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా విజయం సాధించిన కవిత…2020, అక్టోబర్ 29వ తేదీ గురువారం శాసన మండలి సభ్యులుగా పదవీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. శాసనమండలి దర్బార్‌ హాల్‌లో ఆమె…ప్రమాణ స్వీకారానికి సర్వం సిద్ధమైంది.



మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాలకు…శాసనమండలి దర్భార్‌ హాల్‌లో ఆమె ప్రమాణ స్వీకారం జరగనుంది. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ ప్రమాణ స్వీకార కార్యాక్రమానికి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులందరు హాజరుకానున్నారు.



నిజామాబాద్‌ జిల్లాలో పార్టీకి పట్టున్నా…పార్లమెంటు ఎన్నికల్లో ఎంపీగా కవిత విజయం సాధించలేకపోయారు. దాదాపు రెండేళ్ల తరువాత జరిగిన ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో ఎమ్మెల్సీగా విజయం దక్కించుకుని పెద్దల సభలో అడుగుపెడుతున్నారు. దీంతో కల్వకుంట్ల కుటుంబం నుంచి తొలిసారి పెద్దల సభకు ప్రాతినిత్యం దక్కినట్లైంది.



https://10tv.in/which-leader-sacrifice-cabinet-post-for-kavitha/
ఇక తెలంగాణ జాగృతి అధ్యక్షరాలిగా రాష్ట్ర వ్యాప్తంగా కవితకు పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నారు. ఇప్పుడు ఎమ్మెల్సీగా విజయం సాధించడంతో ఆమె అభిమానుల్లో మరింత జోష్ పెరిగింది. గతంలో పార్లమెంటు నియోజకవర్గానికే పరిమితమైన కవిత…ఇప్పుడు ఉమ్మడి జిల్లాలో చక్రం తిప్పే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లా రాజకీయాలు రాబోయే రోజుల్లో కవిత చుట్టూ తిరిగినా…ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదన్న వాదన పార్టీలో మొదలైంది.