అవినీతి కేసులో కామారెడ్డి సీఐ జగదీశ్‌ అరెస్ట్‌

  • Publish Date - November 21, 2020 / 10:25 AM IST

Kamareddy CI Jagadish arrest : కామారెడ్డి సీఐ జగదీశ్‌ను ఏసీబీ అధికారులు అరెస్చ్ చేశారు. అవినీతి కేసులో సీఐ జగదీశ్‌ను అదుపులోకి తీసుకున్నారు. కామారెడ్డి స‌ర్కిల్ఇ న్‌స్పెక్టర్‌ జ‌గ‌దీశ్ నివాసంలో అవినీతి నిరోధ‌క‌శాఖ అధికారులు సోదాలు చేశారు.



అవినీతి ఆరోప‌ణ‌ల‌ు రావడంతో ఏసీబీ అధికారులు తనిఖీలు చేప‌ట్టారు. నిజామాబాద్ ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ పర్యవేక్షణలో ఏడుగురు స‌భ్యుల అధికారుల బృందం సీఐ నివాసంలో సోదాలు నిర్వహించి రికార్డుల‌న్నింటినీ ప‌రిశీలించింది. రాష్ర్టంలో ఇత‌ర ప్రాంతాల్లో ఉన్న జ‌గ‌దీశ్ బంధువుల నివాసాల్లో కూడా సోదాలు చేప‌ట్టింది.



https://10tv.in/newly-wedding-couple-escaped-after-entering-girl-friend/
క్రికెట్‌ బెట్టింగ్‌ కేసులో ఒకరికి స్టేషన్ బెయిల్ ఇచ్చేందుకు.. సీఐ జగదీశ్‌ రూ.5 లక్షలు డిమాండ్‌ చేశారు. బాధితుడు ఏసీబీని ఆశ్రయించడంతో.. సీఐ జగదీశ్ అవినీతి బాగోతం బయటపడింది.

ట్రెండింగ్ వార్తలు