Venkataramana Reddy: కనీసం బ్లాక్ టికెట్లు అమ్మే వారైనా మంచిగా మాట్లాడతారు.. మీరు అంతకంటే..: ఎమ్మెల్యే వెంకట రమణా రెడ్డి

గత ప్రభుత్వాన్ని తిట్టుకుంటూ కూర్చోవడమే తప్ప కాంగ్రెస్ ఏం చేస్తుందనేది చెప్పడం లేదని..

Kamareddy MLA Venkataramana Reddy

తెలంగాణ ప్రభుత్వంపై బీజేపీ ఎమ్మెల్యే వెంకట రమణా రెడ్డి మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయని తెలిపారు. చాలీచాలని మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చిందని చెప్పారు. గత ప్రభుత్వాన్ని తిట్టుకుంటూ కూర్చోవడమే తప్ప కాంగ్రెస్ ఏం చేస్తుందనేది చెప్పడం లేదని తెలిపారు.

శాసనసభలో సంస్కారవంతంగా మాట్లాడం లేదని, కనీసం బ్లాక్ టికెట్లు అమ్మే వారు అయినా మంచిగా మాట్లాడతారని ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చిందా? ఇవ్వలేదా? ఈ విషయాన్నీ స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేశారు. మంత్రి పేషీ వద్ద 20 మందిని నియమించుకుంటున్నారని, పోయిన గెస్ట్‌ల కంటే అటెండర్లే ఎక్కువగా ఉంటున్నారని తెలిపారు.

అసెంబ్లీలో సీఎం, మంత్రులు చిన్నపిల్లలలాగా ఎవరికి తోచినట్లు వారు మాట్లాడుతున్నారని వెంకట రమణా రెడ్డి చెప్పారు. రిటైరైన వారిని ఉద్యోగాల్లో పెట్టుకుంటున్నారని గత ప్రభుత్వంపై అప్పట్లో విమర్శలు చేశారని, మరి ఇప్పుడు వారినే ఇంకా ఎందుకు కొనసాగిస్తున్నారని నిలదీశారు.

రిటైర్ అయిన వారిని నియమించుకుంటే వారికి వృత్తి పట్ల ఏం భయం ఉంటుందని వెంకట రమణా రెడ్డి ప్రశ్నించారు. ప్రజా సమస్యలపై సభలో ఏం చర్చ జరిగిందో చెప్పాలని నిలదీశారు. తెలంగాణ విధ్వంసం, పునర్ నిర్మాణం అంటూనే సభలో చర్చించారని అన్నారు. ఏ జిల్లాలో వచ్చిన నిదులు ఆ జిల్లాలోనే ఖర్చు చేస్తున్నారా అని ప్రశ్నించారు.

Also Read: గోహత్యలు జరుగుతున్నాయ్.. అందుకే వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడి అంతమంది మృతి: బీజేపీ సీనియర్ నేత

ట్రెండింగ్ వార్తలు