Telangana Congress Kamma politics
Telangana Congress – Kamma Politics : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. వివిధ రాజకీయ పార్టీల ఆశావహులు టికెట్ల కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్ లో టికెట్ల లొల్లి కొనసాగుతోంది. టీ కాంగ్రెస్ లో కమ్మ రాజకీయం కొసాగుతున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ కమ్మ రాజకీయ ఐక్య వేదిక నాయకులు తిష్ట వేశారు. సీట్ల కోసం ఆశావహులు ఢిల్లీ బాట పడుతున్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కమ్మ సామాజిక వర్గానికి సముచిత ప్రాధాన్యత కల్పించాలని నేతలు అధిష్టానాన్ని కోరునున్నారు. మాజీ ఎంపీ రేణుకా చౌదరి నాయకత్వంలో ఆశావహులు ఢిల్లీకి వెళ్లారు. నేడు (శుక్రవారం) కేసీ వేణుగోపాల్, మల్లికార్జున ఖర్గేను వివిధ నియోజకవర్గాల కమ్మ సామాజిక వర్గ ఆశావహులు కలవనున్నారు.
Polls to 5 states : నవంబర్ 12 నుంచి డిసెంబర్ 7లోగా అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు
బాన్సువాడ, షేర్ లింగంపల్లి, కూకట్ పల్లి, ఎల్బీ నగర్, జూబ్లీ హిల్స్, కుత్బుల్లాపూర్, సిర్పూర్ కాగజ్ నగర్, మేడ్చల్ స్థానాల్లో కమ్మ అభ్యర్థికి సీట్లు కేటాయించాలని ఆశావహులు అంటున్నారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి కాకుండా మొదటి నుంచి పార్టీ కోసం పని చేసిన వారికి స్థానం కల్పించాలని ఆశావాహులు కోరుతున్నారు.