BRS: కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్ అందుకే పనికొస్తుంది: బీఆర్ఎస్ మహిళా నేతలు

కాంగ్రెస్ డిక్లరేషన్ చెత్త కుండీలో వేయడానికి పనికి వస్తుందని చెప్పుకొచ్చారు. ప్రజలు నమ్మేవిధంగా రిక్లరేషన్ లేదని అన్నారు.

Kavitha, Satyavathi Rathod

BRS – Satyavathi Rathod: కాంగ్రెస్ (Congress) పార్టీ ప్రకటించిన ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ పై బీఆర్ఎస్ భగ్గుమంది. తెలంగాణ ఎన్నికల (Telangana elections 2023) వేళ కాంగ్రెస్ పార్టీ శనివారం చేవెళ్లలో బహిరంగ సభ నిర్వహించి ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ ప్రకటించిన విషయం తెలిసిందే.

దీనిపై మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీ తప్పుడు డిక్లరేషన్ ను ప్రజల ముందు ఉంచిందని అన్నారు. దేశ వ్యాప్తంగా ప్రకటించే దమ్ము ఉందా అని నిలదీశారు. దీనికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమాధానం చెప్పాలని అన్నారు. కర్ణాటకలో అమలు చేసి తెలంగాణలో ఇటువంటి హామీలు ప్రకటించాలని సవాలు విసిరారు.

కర్ణాటకలో ఎన్నికల సమయంలో ఇచ్చిన ఒక్క హామీని కూడా అమలు చేయలేదని అన్నారు. ప్రభుత్వం ఏర్పడ్డ మూడు నెలలకే హామీల అమలు అంశాన్ని ఎత్తి వేశారని విమర్శించారు. తెలంగాణ ప్రజలను ఎన్ని సార్లు మోసం చేస్తారని నిలదీశారు. ఇంకా బుద్ధి, సోయి రాలేదా? అని అన్నారు.

ఎంపీ కవిత మాట్లాడుతూ… కాంగ్రెస్ డిక్లరేషన్ చెత్త కుండీలో వేయడానికి పనికి వస్తుందని చెప్పుకొచ్చారు. ప్రజలు నమ్మేవిధంగా రిక్లరేషన్ లేదని అన్నారు. రిజర్వేషన్లపై పోరాడకుండా, పార్లమెంట్లో బీజేపీ కి మద్దతుగా కాంగ్రెస్ ఉంటుందని చెప్పారు. ఎన్నికల ముందు ఎన్నో ప్రకటిస్తారని అన్నారు. ఇకపై ఇలాంటి డిక్లరేషన్ చేయవద్దని కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తున్నానని చెప్పారు.

Kunamneni Sambashivarao : కాంగ్రెస్, సీపీఐ పొత్తు చర్చలు అవాస్తవం… సీపీఎంతో కలిసి పోటీ : కూనంనేని