Kavuri Sambasiva Rao daughter Srivani
Kavuri Srivani – Maharashtra Police : కావూరి సాంబశివరావు కుమార్తె కావూరి శ్రీవాణిని మహారాష్ట్ర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కావూరి శ్రీవాణిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మహారాష్ట్రలో కావూరి శ్రీవాణిపై చీటింగ్ కేసు నమోదు అయింది.
చీటింగ్ కేసులో భాగంగా మహారాష్ట్ర పోలీసులు కావూరి శ్రీవాణికి ఎల్ఓసీ జారీ చేశారు. కావూరి శ్రీవాణి దుబాయ్ వెళ్లేందుకు నిన్న(గురువారం) రాత్రి శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చారు. వెంటనే విమానాశ్రయ అధికారులు మహారాష్ట్ర పోలీసులకు సమాచారం ఇచ్చారు.
శుక్రవారం ఉదయం మహారాష్ట్ర నుంచి శంషాబాద్ చేరుకున్న పోలీసులు శ్రీవాణిని అదుపులోకి తీసుకున్నారు. రాజేంద్రనగర్ కోర్టులో శ్రీవాణిని హాజరుపరిచి పీటీ వారంట్ పై పోలీసులు మహారాష్ట్ర తీసుకెళ్లనున్నారు.