CM KCR New Party: దసరా రోజు మరోసారి పార్టీ నేతలతో కేసీఆర్ భేటీ.. ఆ రోజే కొత్త పార్టీపై ప్రకటన?

పార్టీ నేతలతో సీఎం కేసీఆర్ ప్రగతి భవన్‌లో ఆదివారం నిర్వహించిన సమావేశం ముగిసింది. దసరా రోజు పార్టీ నేతలతో మరోసారి కేసీఆర్ సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా కొత్త పార్టీ ఏర్పాటుపై తీర్మానం చేస్తారు.

CM KCR New Party: టీఆర్ఎస్ పార్టీ నేతలతో సీఎం కేసీఆర్ సమావేశం ముగిసింది. హైదరాబాద్, ప్రగతి భవన్‌లో ఆదివారం మధ్యాహ్నం తెలంగాణకు చెందిన మంత్రులు, 33 జిల్లాల అధ్యక్షులతో కేసీఆర్ సమావేశమైన సంగతి తెలిసిందే.

Children Drowned: రంగారెడ్డి జిల్లాలో విషాదం… ఈతకు వెళ్లి నలుగురు చిన్నారులు మృతి

ఈ సమావేశంలో కేసీఆర్ స్థాపించబోయే కొత్త పార్టీ ఏర్పాటుపై చర్చించారు. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దసరా రోజు పార్టీ నేతలతో మరోసారి సమావేశం కావాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారు. జాతీయ పార్టీ ఏర్పాటు, ప్రకటనపై ఆరోజే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అనంతరం డిసెంబర్ 9న ఢిల్లీలో కేసీఆర్ భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. దసరా రోజున పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, జిల్లా పరిషత్ చైర్మన్‌లు, డీసీసీబీ చైర్మన్‌లు, డీసీఎంఎస్ చైర్మన్‌లు, జిల్లాల అధ్యక్షులు, గ్రంథాలయ చైర్మన్లతో మరోసారి కేసీఆర్ సమావేశమవుతారు. దీనికి సంబంధించి ఈ నెల 5న అందరూ అందుబాటులో ఉండాలని ఆదేశాలు జారీ చేశారు.

Hyderabad: హైదరాబాద్‌లో ఉగ్రకుట్ర భగ్నం.. పేలుళ్లకు కుట్ర పన్నిన నిందితుడితోపాటు యువకుల అరెస్ట్

బుధవారం ఉదయం 10.30 గంటలకు ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశం నిర్వహించబోయే తెలంగాణ భవన్‌లో దాదాపు 300 మంది సమావేశమయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సమావేశంలో జాతీయ పార్టీ ఏర్పాటుపై టీఆర్ఎస్ రాష్ట్ర కమిటీ తీర్మానం చేస్తుంది. అనంతరం కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటించే అవకాశం ఉంది. ఈ విషయంలో ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. సమావేశం అనంతరం పార్టీ నేతలతో సీఎం కేసీఆర్ లంచ్ చేస్తారు.

ట్రెండింగ్ వార్తలు