Children Drowned: రంగారెడ్డి జిల్లాలో విషాదం… ఈతకు వెళ్లి నలుగురు చిన్నారులు మృతి

రంగారెడ్డి జిల్లాలో ఈత సరదాకు నలుగురు చిన్నారులు బలయ్యారు. చెరువులో మునిగి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన ఆదివారం జరిగింది.

Children Drowned: రంగారెడ్డి జిల్లాలో విషాదం… ఈతకు వెళ్లి నలుగురు చిన్నారులు మృతి

Children Drowned: రంగారెడ్డి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఈత సరదా నలుగురు చిన్నారుల ప్రాణం తీసింది. దసరా సెలవులు, పైగా ఆదివారం కావడంతో ఈతకు వెళ్లిన చిన్నారులు స్థానిక చెరువులో మునిగి ప్రాణాలు కోల్పోయారు.

Hyderabad: హైదరాబాద్‌లో ఉగ్రకుట్ర భగ్నం.. పేలుళ్లకు కుట్ర పన్నిన నిందితుడితోపాటు యువకుల అరెస్ట్

ఈ ఘటన రంగారెడ్డి జిల్లా తాడిపర్తి, ఎర్రకుంట చెరువులో ఆదివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నలుగురు చిన్నారులు స్థానిక చెరువుకు ఈతకు వెళ్లారు. అయితే చెరువులో లోతు ఎక్కువగా ఉండటంతో నీళ్లలో మునిగి, ఊపిరాడకపోవడంతో చిన్నారులు మరణించారు. సమాచారం అందుకున్న పిల్లల కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. ప్రమాదంలో మరణించిన చిన్నారుల మృతదేహాల్ని అధికారులు వెలికితీశారు.

మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారు. మృతులను ఖలీద్ (12), రేహాన్ (10), ఇమ్రాన్ (09), సమ్రీన్ (14)గా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.