KCR Emotional: జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గుండెపోటుతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందిన విషయం తెలిసిందే. జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసం వద్ద భౌతికకాయాన్ని ప్రముఖులు, ప్రజల సందర్శనార్ధం ఉంచారు. పలువురు రాజకీయ ప్రముఖులు గోపీనాథ్ భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ మాగంటి గోపీనాథ్ భౌతికకాయానికి నివాళులర్పించేందుకు వెళ్లారు. గోపీనాథ్ భౌతికకాయాన్ని చూడగానే ఒక్కసారిగా కన్నీటి పర్యాంతమయ్యారు. అనంతరం మాగంటి భౌతికకాయం వద్ద పుష్పగుచ్చాన్ని ఉంచి నివాళులర్పించారు. ఆ తరువాత మాగంటి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయన కుమారుడిని ఆప్యాయంగా దగ్గరకు తీసుకొని ధైర్యం చెప్పారు. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.