Vijayashanti Election Campaign At Warangal
Vijayashanti Election Campaign At Warangal : ఎక్కడో పొరపాటు జరిగింది..అందుకే కేసీఆర్ రెండు సార్లు అధికారంలోకి వచ్చారు అంటూ కాంగ్రెస్ నేత విజయశాంతి కీలక వ్యాఖ్యలు చేశారు. వరంగల్ లో కాంగ్రెస్ ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్న రాములమ్మ మాట్లాడుతు..పోరాటాల పురిటి గడ్డ తెలంగాణ ప్రజలు చాలా విజ్ఞులు అంటూ ప్రశ్నించారు. వరంగల్ లో చాలామంది మేధావులున్నారు..ఆచి తూచి అడుగువేసేవారున్నారు. ఆలోచించి ఓటు వేసేవారున్నారు. అయినా కేసీఆర్ రెండు సార్లు అధికారంలోకి వచ్చారు..బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు,మంత్రులు కేసీఆర్ కుటుంబం తెలంగాణను దోచేస్తుంటే ఎందుకు రెండు సార్లు అధికారం ఇచ్చారు? అని ప్రశ్నించారు. అలా జరిగింది అంటూ ఎక్కడో పొరపాటు జరిగింది అంటూ వ్యాఖ్యానించారు.
కేసీఆర్ ఎంత ఘటికుడు అయితే ప్రజల్ని మరీ ముఖ్యంగా వరంగల్ ప్రజల్ని కూడా మోసం చేయగలిగాడో ఆలోచించాలన్నారు. ప్రజలు ఈసారి అయినా ఆలోచించాలన్నారు. ఆలోచించి ఓటు వేయాలని కోరారు. మరోసారి మోసంలో పడవద్దని సూచించారు. ఎవరైతే మిమ్మల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చారో వారికే మీరు పాఠాలు నేర్చించండీ అంటూ తనదైనశైలిలో విజయశాంతి ప్రసంగించారు. పోరాటాల పురిటి గడ్డ వరంగల్ నుంచే కేసీఆర్ పతనాన్ని ప్రారంభించండి అని పిలుపునిచ్చారు.
Vijayashanthi : కాళేశ్వరం మీకు కాటేశ్వరం అవుతుంది : CM కేసీఆర్‌పై విజయశాంతి మాటల తూటాలు
ప్రజల్ని అమాయకులని చులకన చేసే నేతలకు బుద్ధి చెప్పాలన్నారు. ఎవరైతే రాజకీయంగా లబ్ది పొంది ప్రజలకు అభివద్ధి ఫలాలు అందకుండా చేశారో వారికి రాజకీయ గుణపాఠాలు నేర్పాలని ఈ సందర్భంగా వరంగల్ వేదికగా విజయశాంతి పిలుపునిచ్చారు. ఇప్పటికే రెండు సార్లు అధికారంలోకి వచ్చి ప్రజల్ని మోసం చేసిన వారికి బుద్ధి చెప్పాలన్నారు. కాంగ్రెస్ కు ఓట్లు వేసి గెలిపించి అధికారంలోకి తీసుకొచ్చి కేసీఆర్ కు గుణపాఠం చెప్పాలని ఓటర్లను కోరారు.