తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియ నిలిచిపోగా.. ఈ విషయంలో సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్రంలో ఎల్ఆర్ఎస్ పూర్తిగా చెల్లించకున్నా కూడా రిజిస్ట్రేషన్‌లకు వెసులుబాటు కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎల్ఆర్ఎస్ లేకుండానే వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అనుమతి ఇస్తూ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీచేసింది.
అయితే కొత్తగా వేసిన లే అవుట్లకు మాత్రం రిజిస్ట్రేషన్‌లను నిలిపివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కొద్దిరోజులుగా తెలంగాణ రాష్ట్రంలో వ్యసాయేతర భూముల రిజిస్ట్రేషన్లకు ప్రభుత్వం ఇబ్బందులు పెడుతుండగా.. రాష్ట్ర సర్కారు ఇప్పుడు గ్రీన్‌సిగ్నల్ ఇస్తూ నిర్ణయం తీసుకుంది.
వివిధ సాంకేతిక కారణాలతో కొన్ని రోజుల నుంచి వాయిదా పడిన ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రభుత్వం నిర్ణయంతో ప్రారంభం కానున్నది. ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్ని రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు ఈ మేరకు ఉత్తర్వులు వెళ్లాయి. తాజా నిర్ణయంతో ఎల్ఆర్ఎస్ లేని ఫ్లాట్లకు కూడా రిజిస్ట్రేషన్లు కానున్నాయి. ఎల్ఆర్ఎస్ పూర్తిగా కట్టుకున్నా కూడా రిజిస్ట్రేషన్ ప్రక్రియ సాగబోతోంది.