Key Directions Of The Telangana High Court On The Jamuna Hatcheries Petition
Jamuna Hatcheries petition : జమున హ్యాచరీస్ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. మే1, 2 వ తేదీల్లో జరిగిన విచారణను పరిగణనలోకి తీసుకోవద్దని ఆదేశించింది. సరైన పద్ధతిలో నోటీసులు ఇచ్చి విచారణ జరపాలని ప్రభుత్వానికి తెలిపింది.
నోటీసులు ఇచ్చాక నిబంధనల ప్రకారం సమయం ఇవ్వాలని సూచించింది. శుక్రవారం నోటీసులు ఇచ్చి సోమవారం రిప్లై ఇవ్వమనేలా ఉండకూడదని స్పష్టం చేసింది.
రాచమార్గంలో వెళ్లాలని..బ్యాక్ గేట్ నుంచి కాదని ప్రభుత్వానికి హితవు పలికింది. ప్రభుత్వం చట్ట ప్రకారం వ్యవహరించాలని తెలిపింది. తదుపరి విచారణను జులై 6కు వాయిదా వేసింది.