Khairatabad Ganesh: భక్తజన సందోహం మధ్య ఖైరతాబాద్ గణేషుడి నిమజ్జన శోభాయాత్ర.. ప్రత్యక్షప్రసారం

ఉదయం 6గంటలకు మహాగణపతి శోభాయాత్ర ప్రారంభమైంది. కమిటీ సభ్యులు హారతి ఇచ్చి శోభయాత్ర ప్రారంభించారు. భారీ సంఖ్యలో భక్తులు తరలిరాగా.. జై బోలో గణేశ్ మహరాజ్ కు జై.. గణపతి బప్పామోరియా అంటూ

Khairatabad Ganesh

Khairatabad Ganesh Nimajjanam 2024 : హైదరాబాద్ లో ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనోత్సవానికి బయలుదేరారు. శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతిగా పదిరోజుల పాటు భక్తుల నీరాజనాలు అందుకున్న ఖైరతాబాద్ గణనాథుడు మరికొద్ది గంటల్లో గంగమ్మ ఒడికి చేరనున్నాడు. 70 అడుగుల ఎత్తులో భారీ కాయుడైన గణపతికి సోమవారం రాత్రి 10గంటలకు చివరి సారిగా కలశపూజ నిర్వహించారు. ఆ తరువాత మహాగణపతిని టస్కర్ పైకి చేర్చారు.

Also Read : Ganesh Nimajjanam: గణనాథుల నిమజ్జన వేడుకల్లో పాల్గొనే భక్తులకు గుడ్‌న్యూస్‌

మంగళవారం ఉదయం 6గంటలకు మహాగణపతి శోభాయాత్ర ప్రారంభమైంది. కమిటీ సభ్యులు హారతి ఇచ్చి శోభయాత్ర ప్రారంభించారు. భారీ సంఖ్యలో భక్తులు తరలిరాగా.. జై బోలో గణేశ్ మహరాజ్ కు జై.. గణపతి బప్పామోరియా అంటూ నినాదాలు చేస్తున్నారు. ఖైరతాబాద్ గణేశుడి శోభాయాత్రలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు.

మహాగణపతి శోభాయాత్ర .. ఖైరతాబాద్, సెన్సేషనల్ థియేటర్, రాజ్ దూత్ హోటల్, టెలిఫోన్ భవన్, తెలుగు తల్లి ఫ్లై ఓవర్, సెక్రటేరియట్, ఎన్టీఆర్ మార్గ్ వరకు కొనసాగనుంది. ఎన్టీఆర్ మార్గ్ లో మహా గణపతి నిమజ్జనోత్సవానికి ఏర్పాట్లు చేశారు. ఎన్టీఆర్ మార్గ్ లో ఏర్పాటు చేసిన 4వ నెంబర్ క్రేన్ ద్వారా ఖైరతాబాద్ గణపతిని నిమజ్జనం చేయనున్నారు. హుస్సేన్ సాగర్ లో మధ్యాహ్నం 2గంటల లోపే ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం పూర్తయ్యేలా నిర్వాహకులు, పోలీసులు ఏర్పాట్లు చేశారు.

Also Read : ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్