Tummala Nageswara Rao : నేను గెలిస్తే వాళ్ల దోపీడీ ఉండదు.. ఎన్నికల ప్రచారంలో తుమ్మల సంచలన వ్యాఖ్యలు..

ప్రకాశ్ నగర్ బ్రిడ్జి ఎక్కడుందో తెలియనోళ్లు ఇప్పుడు ప్రకాశ్ నగర్ బ్రిడ్జి కట్టింది మేమే అంటూ చెప్పుకుంటున్నారు. ప్రజల భూమి కబ్జాలుచేసి కాలేజీ కట్టుకొని చుట్టు పెన్సింగ్ వేసి ఎవ్వరిని రానీయకుండ చేసుకున్నారంటూ తుమ్మల విమర్శించారు.

Tummala Nageswara Rao

Khammam Politics : ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ మంత్రి, ఖమ్మం నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు మంగళవారం వ్యవసాయ మార్కెట్ లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. నేను దోచుకోవాలంటే ఎన్టీఆర్, చంద్రబాబు, కేసీఆర్ టైంలో మంత్రిని.. కానీ, నిజాయితీగా జిల్లా అభివృద్ధికోసం పనిచేశానని అన్నారు. ఎప్పుడూ రైతునే వ్యవసాయ మార్కెట్ చైర్మన్ గా పెట్టేవాళ్లం. ఇప్పుడు ఎవరిని పెట్టారో మీకు తెలుసు. ఒకప్పుడు మార్కెట్ కు సరియైన దారికూడా ఉండేది కాదు.. మా హయాంలో మార్కెట్ ను అభివృద్ధి చేశామని తుమ్మల చెప్పారు.

Also Read : Raghunandan Rao : దళితబంధు రాలేదని..? కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి, ఎమ్మెల్యే రఘునందన్ కీలక వ్యాఖ్యలు

ప్రకాశ్ నగర్ బ్రిడ్జి ఎక్కడుందో తెలియనోళ్లు ఇప్పుడు ప్రకాశ్ నగర్ బ్రిడ్జి కట్టింది మేమే అంటూ చెప్పుకుంటున్నారు. ప్రజల భూమి కబ్జాలుచేసి కాలేజీ కట్టుకొని చుట్టు పెన్సింగ్ వేసి ఎవ్వరిని రానీయకుండ చేసుకున్నారంటూ తుమ్మల విమర్శించారు. ఖమ్మం గుట్టలను మాయం చేశారు. మట్టి దోచుకున్నారు. మొత్తానికి ఖమ్మంలో అంతా దోచుకునే ముఠాను తయారు చేశారంటూ తుమ్మల మండిపడ్డారు. ఈ ఎన్నికల్లో నేను గెలిస్తే అరాచకాలు, దోపీడీ చేసేవాళ్లు ఉండరు. వాళ్ల సంగతి చూస్తాఅంటూ తుమ్మల వ్యాఖ్యానించారు.

Also Read : V.Hanumantha Rao : బీసీ వ్యక్తిని సీఎం చేస్తామని బీజేపీ అనటం చాలా గొప్ప విషయం : వీహెచ్

రాబోయే ఎన్నికల్లో నన్ను గెలిపిస్తే వ్యవసాయ మార్కెట్ ను మోడల్ మార్కెట్ చేస్తా. మీరు దుమ్ముదూళితో దగ్గకుండా చేస్తా.. రైతులకు కూర్చునే విధంగా ఏసీ గదులు కట్టిస్తానని తుమ్మల హామీ ఇచ్చారు. మొన్న ఇచ్చిన లైసెన్సుల్లో అవినీతి జరిగిందని తుమ్మల అన్నారు. కొత్త బస్టాండ్ ను శంకుస్థాపన చేస్తే వాళ్లు చేసినట్లు చెప్పుకున్నారు. పాత బస్టాండ్ ను 99 సంవత్సరాల లీజ్ పేరుతో ఆక్రమించాలని చూశారంటూ తుమ్మల ప్రత్యర్థులపై మండిపడ్డారు. నేను గెలిచాక నియోజకవర్గ ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేస్తా.. మీకు కావాల్సిన విధంగా, మీ మనస్సులో ఏముందో అదేచేస్తా అంటూ తుమ్మల చెప్పారు. స్వచ్ఛమైన, నీతివంతమైన పాలనకోసం సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పోరాడుతున్నారని తుమ్మల అన్నారు.