ఎంపీలుగా తెలుగులో ప్రమాణ స్వీకారం చేసిన కేంద్ర మంత్రులు.. పంచెకట్టులో కిషన్ రెడ్డి..

కేంద్ర మంత్రి వర్గంలో తెలుగు రాష్ట్రాల నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులుగా, ముగ్గురు సహాయ మంత్రులుగా ఉన్న విషయం తెలిసిందే. తాజాగా పార్లమెంట్ లో ఎంపీల ప్రమాణస్వీకారోత్సవం సందర్భంగా ...

Kishan Reddy and Ram Mohan Naidu : 18వ లోక్ సభ తొలి సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్ ఎంపీలతో ప్రమాణ స్వీకారం చేయిస్తున్నారు. తొలుత వారణాసి ఎంపీగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తరువాత రాధా మోహన్ సింగ్, రాజ్ నాథ్ సింగ్, అమిత్ షా, గడ్కరీ, శివరాజ్ సింగ్ చౌహాన్ ఎంపీలుగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరితోపాటు తెలుగు రాష్ట్రాల నుంచి కేంద్ర మంత్రులు, సహాయ మంత్రులుగాఉన్న వారుకూడా ఎంపీలుగా ప్రమాణ స్వీకారం చేశారు.

Also Read : తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీ.. ఆమ్రపాలికి కీలక పోస్ట్

కేంద్ర మంత్రి వర్గంలో తెలుగు రాష్ట్రాల నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులుగా, ముగ్గురు సహాయ మంత్రులుగా ఉన్న విషయం తెలిసిందే. తాజాగా పార్లమెంట్ లో ఎంపీల ప్రమాణస్వీకారోత్సవం సందర్భంగా కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, రామ్మోహన్ నాయుడు, కేంద్ర సహాయ మంత్రులు బండి సంజయ్, పెమ్మసాని చంద్రశేఖర్, భూపతిరాజు శ్రీనివాస వర్మలు ప్రమాణ స్వీకారం చేశారు. వీరంతా తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరోవైపు పార్లమెంట్ లో ఎంపీగా ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి కిషన్ రెడ్డి పంచెకట్టులో హాజరుకావటం గమనార్హం.

Also Read : మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నారా లోకేశ్.. తొలి సంతకం ఏ ఫైలుపై చేశారంటే..

మంత్రి మండలి సభ్యుల ప్రమాణ స్వీకారం పూర్తయిన తరువాత ఆంగ్ల అక్షరమాల క్రమం ప్రకారం రాష్ట్రాలకు చెందిన ఎంపీలు ప్రమాణం చేశారు. తొలుత ఆంధ్రప్రదేశ్ ఎంపీలకు అవకాశం రావడంతో.. ఎంపీలు ప్రమాణ స్వీకారం చేశారు. అయితే, వీరిలో శ్రీభరత్, కలిశెట్టి అప్పలనాయుడు, దగ్గుబాటి పురందేశ్వరి, కేశినేని చిన్ని, వల్లభనేని బాలశౌరి, లావు శ్రీకృష్ణ దేవరాయలు తెలుగులో ప్రమాణ స్వీకారం చేయగా.. మిగిలిన ఏపీకి చెందిన ఎంపీలు కొందరు హిందీ, కొందరు ఇంగ్లీష్ లో ప్రమాణం చేశారు.

 

ట్రెండింగ్ వార్తలు