తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీ.. ఆమ్రపాలికి కీలక పోస్ట్

తెలంగాణ ప్రభుత్వం 44 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ సోమవారం ఉత్తర్వులు ఇచ్చింది.

తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీ.. ఆమ్రపాలికి కీలక పోస్ట్

Telangana Govt transfers 44 IAS officers including GHMC commissioner

Telangana IAS officers transfers: తెలంగాణలో భారీగా సంఖ్యలో ఐఏఎస్ అధికారుల బదిలీలు చేస్తూ ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది. 44 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు ఇచ్చింది. జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ బదలీ అయ్యారు. ఆయన స్థానంలో కాట ఆమ్రపాలిని జీహెచ్ఎంసీ కమిషనర్ గా నియమితులయ్యారు.

బదిలీ అయిన అధికారుల వివరాలు
హెచ్ఎండీఏ కమిషనర్ : సర్ఫరాజ్ అహ్మద్
జలమండలి ఎండీ: అశోక్ రెడ్డి
ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ: రొనాల్డ్ రాస్
ఖైరతాబాద్ జోనల్ కమిషనర్: అనురాగ్ జయంతి
కూకట్ పల్లి జోనల్ కమిషనర్: అపూర్వ్ చౌహాన్
ఎల్బీ నగర్ జోనల్ కమిషనర్: హేమంత్ కేశవ్ పాటిల్
శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్: పి. ఉపేందర్ రెడ్డి
జీహెచ్ఎంసీ అడిషినల్ కమిషనర్: స్నేహ షబారిశ్
మూసీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ: గౌతమి
జీహెచ్ఎంసీ ఈవీడీఎం కమిషనర్: ఏవీ రంగనాథ్ (IPS)

జీఏడీ సెక్రటరీ: సుదర్శన్ రెడ్డి
కమర్షిల్ ట్యాక్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ: సయిద్ అలీ ముర్తజా రిజ్వీ
పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్: నరసింహారెడ్డి
టూరిజం ప్రిన్సిపల్ సెక్రటరీ: వాణీప్రసాద్

Also Read: బ్లాక్ బుక్ రెడీ చేస్తున్నా, మీ సంగతి చూస్తా- అధికారులకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే వార్నింగ్

కార్మి, ఉపాధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ: సంజయ్ కుమార్
పశుసంరక్షణ, డెయిరీ ప్రిన్సిపల్ సెక్రటరీ: సవ్యసాచి ఘోష్
పరిశ్రమలు, వాణిజ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ: శైలజా రామయ్యర్
పర్యావరణం, అటవీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ: అహ్మద్ నదీం
ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ: సందీప్ కుమార్ సుల్తానీయ

రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ: జ్యోతి బుద్ధప్రకాశ్
తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఎండీ: సోని బాలాదేవి
ట్రాన్స్‌పోర్ట్ క‌మిష‌న‌ర్‌: ఇలంబరితి కె

కాలేజీ టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్: ఎ. శ్రీదేవసేన
సెర్ఫ్ సీఈవో: డి. దివ్య
రోడ్లు, భవనాల శాఖ స్పెషల్ సెక్రటరీ: హరిచందన దాసరి
టూరిజం శాఖ ఎండీ: న్యాయలకొండ ప్రకాశ్ రెడ్డి
సోషల్ వెల్ఫేర్ సెక్రటరీ: అలగు వర్షిణి
హౌసింగ్ స్పెషల్ సెక్రటరీ: వీపీ గౌతమ్
కార్మిక శాఖ ఉపాధి, శిక్షణ డైరెక్టర్: కృష్ణ ఆదిత్య ఎస్
ఐటీ శాఖ డిప్యూటీ సెక్రటరీ: భవేశ్ మిశ్రా

పీసీబీ మెంబర్ సెక్రటరీ: జి. రవి
టీజీఐఆర్డీ సీఈవో: కె. నిఖిల
హార్టికల్చర్, సెరికల్చర్ డైరెక్టర్: యస్మీన్ భాషా
ప్రొటోకాల్ డైరెక్టర్: ఎస్ వెంకటరావు
వ్యవసాయం, సహకార జాయింట్ డైరెక్టర్: పి. ఉదయ్ కుమార్
పశుసంరక్షణ శాఖ డైరెక్టర్: బి. గోపీ
ఫిషరీస్ శాఖ డైరెక్టర్: ప్రియాంక అలా
టూరిజం శాఖ డైరెక్టర్: ఐలా త్రిపాఠి

ఫైనాన్స్ కార్పొరేషన్ జాయింట్ ఎండీ: పి. కాత్యాయని
పాఠశాల విద్య డైరెక్టర్: ఈవీ నరసింహారెడ్డి
మెడికల్ సర్వీసెస్ కార్పొరేషన్ ఎండీ: హేమంత్ సహదేవరావు
ఖమ్మం మున్సిపల్ కమిషనర్: అభిషేక్ అగస్త్య
ఐటీడీఏ భద్రాచలం పీవో: బి. రాహుల్
టీజీఐఐసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్: నిఖిల్ చక్రవర్తి