×
Ad

Kokapet Lands: రికార్డులు బద్దలు.. ఎకరం రూ.151 కోట్లు.. కోకాపేటలో భూములకు రికార్డు రేటు..

ప్లాట్ నెంబర్ 16లోని ఎకరం భూమి ధర 146 కోట్ల రూపాయలకు పైగా అమ్ముడుపోయింది.

Kokapet Lands: హైదరాబాద్ లో భూముల ధరల రికార్డులు మళ్లీ బ్రేక్ అయ్యాయి. హైదరాబాద్ మెట్రో డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) ఆధ్వర్యంలో నిర్వహించిన భూముల వేలం మరోసారి హైదరాబాద్ భూముల విలువలను తెలియజేసింది. కోకాపేటలోని నియోపోలిస్ సమీపంలోని ప్లాట్
నెంబర్ 15, 16లోని భూములకు వేలం నిర్వహించింది హెచ్ఎండీఏ. ఇందులో ప్లాట్ నెంబర్ 15లోని దాదాపు 4 ఎకరాలు, ప్లాట్ నెంబర్ 16లోని 5 ఎకరాలకు వేలం నిర్వహించగా.. ప్లాట్ నెంబర్ 15లోని ఎకరం భూమి ధర అత్యధికంగా 150 కోట్ల రూపాయలు పలికింది. 151 కోట్ల 25 లక్షలు పలికింది.

ప్లాట్ నెంబర్ 16లోని ఎకరం భూమి ధర రూ.147 కోట్ల 75 లక్షలు పలికింది. మొత్తంగా 9 ఎకరాల విస్తీర్ణంలో ఉండే రెండు ప్లాట్ల వేలం ద్వారా హెచ్ఎండీఏకు రూ.1352 కోట్లకుపైగా ఆదాయం వచ్చింది. 4 రోజుల క్రితం నిర్వహించిన వేలంలోనూ ఇదే విధమైన ధరలు పలికాయి. అప్పుడు కూడా 1350 కోట్లకుపైగా ఆదాయం హెచ్ఎండీఏకు రావడం జరిగింది.

కోకాపేట నియోపోలిస్ లేఔట్.. ఔటర్ రింగ్ రోడ్ కు అతి దగ్గరగా ఉంటుంది. అదే విధంగా ఐటీ ఏరియాకు చాలా సమీపంలో ఉంటుంది. అంతేకాదు ఈ భూములను దేనికోసమైనా వాడుకోవచ్చు. ఆఫీస్ కోసం వాడొచ్చు లేదంటే బహుళ అంతస్తుల నిర్మాణాలకు వాడుకోవచ్చు. అందుకే, ఎక్కువ ధరకు వీటిని కొనుగోలు చేసేందుకు చాలా సంస్థలు పోటీపడుతున్నాయి. గత ప్రభుత్వంలోనూ ఈ ప్రాంతానికి సంబంధించిన భూమి అత్యధిక ధర పలికింది. ఆ సమయంలో ఒక ఎకరం 100 కోట్ల రూపాయల ధర పలికింది. ఈసారి ఆ ధర పెరుగుతూ పెరుగుతూ పోతోంది. నియోపోలిస్ లో ఎకరం భూమి 151 కోట్లు పలికింది.

Also Read: హెల్త్ ఇన్సూరెన్స్ ఎలా ఎంచుకోవాలి? ఫ్యామిలీ ఫ్లోటర్, పర్సనల్ పాలసీ.. మీ ఫ్యామిలీకి ఏది బెటర్?