Komatireddy Venkat Reddy: రేవంత్‌తో భేటీ అయిన కోమటిరెడ్డి.. గాంధీ భవన్‌లో ఆసక్తికర ఘటన

దాదాపు ఏడాది తర్వాత కోమటిరెడ్డి గాంధీ భవన్‌కు వెళ్లడం ఆసక్తికరంగా మారింది. అంతేకాదు.. ఆయన తరచూ వ్యతిరేకించే రేవంత్ రెడ్డితో కూడా సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సందర్భంగా కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడారు.

Komatireddy Venkat Reddy: తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి శుక్రవారం ఆసక్తికర ఘటన జరిగింది. కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గాంధీ భవన్ వచ్చారు. అంతేకాదు.. అక్కడ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. అనంతరం టీ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జి మాణిక్ రావ్ ఠాక్రేతో కూడా కోమటిరెడ్డి సమావేశమయ్యారు.

Swati Maliwal: స్వాతి మాలివాల్‌ను కారుతో లాక్కెళ్లిన వీడియో విడుదల.. స్వాతిపై బీజేపీ విమర్శలు

దాదాపు ఏడాది తర్వాత కోమటిరెడ్డి గాంధీ భవన్‌కు వెళ్లడం ఆసక్తికరంగా మారింది. అంతేకాదు.. ఆయన తరచూ వ్యతిరేకించే రేవంత్ రెడ్డితో కూడా సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సందర్భంగా కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘‘గాంధీభవన్‌కు రానని నేనెప్పుడూ చెప్పలేదు. టీ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జి మాణిక్ రావ్ ఠాక్రే నాకు ఫోన్ చేశారు. ఆయన ఆహ్వానం మేరకే ఇక్కడికి వచ్చా. జనవరి 26 నుంచి జరిగే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటా. నా నియోజకవర్గ పనుల్లో బిజీగా ఉండటం వల్ల ఇప్పటివరకు రాలేకపోయా. కాంగ్రెస్ పార్టీ ఎలా అధికారంలోకి తేవాలో మాణిక్ రావు ఠాక్రేకు చెబుతా. కేసీఆర్ ఖమ్మంలో నిర్వహించిన సభల్లాంటివి కాంగ్రెస్ గతంలో వందల్లో పెట్టింది. ఎన్ని సభలు నిర్వహించినా కేసీఆర్ ఏం చేయలేరు. అవసరమైతే తెలంగాణవ్యాప్తంగా పాదయాత్ర చేస్తా’’ అని కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు.

Kerala: కాలేజీలో హీరోయిన్‌తో విద్యార్థి అసభ్య ప్రవర్తన.. సస్పెండ్ చేసిన యాజమాన్యం

అయితే, ప్రస్తుతం కోమటిరెడ్డి వ్యవహారశైలి చర్చనీయాంశంగా మారింది. కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటున్న ఆయన తిరిగి అదే పార్టీలో కొనసాగాలని నిర్ణయించుకున్నారా అనే సందేహం కాంగ్రెస్ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. మరోవైపు ఇదే భేటీకి వచ్చిన వీహెచ్.. గాంధీ భవన్ నుంచి అలిగి వెళ్లిపోయారు. తాను నిర్వహించబోయే క్రికెట్ టోర్నీకి రావాలని వీహెచ్.. మాణిక్ రావ్ ఠాక్రేను కోరారు. కానీ, పార్టీ కార్యక్రమాలు ఉన్నందున తాను రాలేనని ఠాక్రే చెప్పారు. దీంతో ఆయన గాంధీ భవన్ నుంచి అలిగి వెళ్లిపోయారు.

ట్రెండింగ్ వార్తలు