రూ.325 కోట్లతో పనులు… డిసెంబరులోపు పూర్తి: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

Komatireddy Venkat Reddy: తెలంగాణలో వారం రోజుల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనుల కార్యక్రమం చేపడతామని కోమటిరెడ్డి చెప్పారు.

నల్గొండ జిల్లాలోని చిట్యాలలో ఫ్లై ఓవర్ నిర్మాణానికి తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూ.325 కోట్లతో పనులు డిసెంబరులోపు పూర్తి చేస్తామని అన్నారు. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై 17 బ్లాక్ స్పాట్లను గుర్తించినట్లు తెలిపారు.

నల్గొండ జిల్లాకు 500 కోట్ల రూపాయలతో ఆర్అండ్‌బీ రహదారులు తెచ్చామని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు. నల్గొండ, నకిరేకల్ నియోజకవర్గాలు తనకు రెండు కళ్లలాంటివని చెప్పుకొచ్చారు. తన జీవితం ప్రజలకే అంకితమని చెప్పారు.

తెలంగాణలో వారం రోజుల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనుల కార్యక్రమం చేపడతామని కోమటిరెడ్డి చెప్పారు. గత ప్రభుత్వం చేసిన 26 వేల కోట్ల రూపాయల రుణాలకు బకాయిలు కట్టినట్లు తెలిపారు. బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టుకు రూ.400 కోట్లతో 80,000 ఎకరాలకు మూడు నెలల్లో నీళ్లు ఇస్తామని తెలిపారు. 30 వేల కోట్ల రూపాయలతో హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్డు పనులు చేపట్టనున్నామని చెప్పారు. నకిరేకల్ టోల్గేట్ వద్ద ఎన్నారైల సహకారంతో ట్రామ కేర్ సెంటర్ ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

Also Read: రేవంత్ రెడ్డి బీజేపీతో కలిసి సింగరేణి వేలంకు కుట్ర చేస్తున్నారు : కొప్పుల ఈశ్వర్

ట్రెండింగ్ వార్తలు