రేవంత్ రెడ్డి బీజేపీతో కలిసి సింగరేణి వేలంకు కుట్ర చేస్తున్నారు : కొప్పుల ఈశ్వర్

ఒరిస్సా, గుజరాత్ ప్రభుత్వాలు రిక్వెస్ట్ చేస్తే గనులను ఆ రాష్ట్రాలకు వదిలేశారు?. రేవంత్ రెడ్డి సింగరేణి సంస్థలను కాపాడాలని

రేవంత్ రెడ్డి బీజేపీతో కలిసి సింగరేణి వేలంకు కుట్ర చేస్తున్నారు : కొప్పుల ఈశ్వర్

Koppula Eshwar

Koppula Eshwar : కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కాంగ్రెస్ వచ్చిన తర్వాత సింగరేణిని ప్రయివేటీకరణ చేయడానికి స్పీడ్ గా అడుగులు వేస్తున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఆదివారం కరీంనగర్ లో ఆయన మీడియాతో మాట్లాడారు.. కిషన్ రెడ్డి సింగరేణిని రక్షించేందుకు చట్టాలను సవరించే ప్రయత్నం చేయాలన్నారు. సింగరేణి తెలంగాణ ప్రాంతానికి కొంగు బంగారం. సింగరేణి సంస్థ లక్షలాది మందికి ఉపాధి కల్పించిన సంస్థ. కేసీఆర్ నాయకత్వంలో లాభాల బాటలో సింగరేణి ముందుకు పోయిందని కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. 32శాతం లాభాలను కార్మికులకు ఇచ్చింది సింగరేణి.. ప్రభుత్వరంగ సంస్థ, లాభాలను ఆర్జిస్తున్న సంస్థను ప్రయివేట్ పరం చేయడం దురదృష్టకరమని అన్నారు.

Also Read: Kalki 2898AD : తెలంగాణలో భారీగా కల్కి టికెట్ రేట్లు పెంపు.. ఎంతంటే.. బెనిఫిట్ షోలు కూడా..

ఒరిస్సా, గుజరాత్ ప్రభుత్వాలు రిక్వెస్ట్ చేస్తే గనులను ఆ రాష్ట్రాలకు వదిలేశారు?. రేవంత్ రెడ్డి సింగరేణి సంస్థలను కాపాడాలని ఆరోజు లేఖ రాశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చారని కొప్పుల విమర్శించారు. మీ హయంలో సింగరేణి సంస్థను ప్రైవేట్ పరం చేస్తే ఇంతకన్నా దారుణం మరికటి ఉండదని రేవంత్ ప్రభుత్వానికి కొప్పుల సూచించారు. రేవంత్ రెడ్డి బీజేపీతో కలిసి సింగరేణి వేలంకు కుట్ర చేస్తున్నారని కొప్పుల విమర్శించారు.

Also Read : వెంకట్రామిరెడ్డి ధరణి పేరుతో చేసిన మోసాలు బయటపెడతా: రఘునందన్ రావు

భట్టి విక్రమార్క వేలంపాటలో వేదిక పంచుకోవడం ద్వంద నీతికి నిదర్శనమని కొప్పుల అన్నారు. రాజకీయాలు కాదు రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం. ప్రయివేటీకరణకు అర్ధం ఏంటో కిషన్ రెడ్డి చెప్పాలని కొప్పుల ఈశ్వర్ ప్రశ్నించారు. ప్రయివేటు వాళ్లకుఇస్తే రిజర్వేషన్లు, ఉద్యోగాలు కోల్పోతారని అన్నారు. యాక్షన్ లో పెట్టిన శ్రవణాపల్లి ప్రక్రియను వెంటనే ఆపాలని కొప్పుల ఈశ్వర్ డిమాండ్ చేశారు.