Koneru Konappa : ఎమ్మెల్సీ ఎన్నికల వేళ కాంగ్రెస్ కు కోనేరు కోనప్ప ఝలక్..

గత కొంత కాలంగా కోనేరు కోనప్ప కాంగ్రెస్ పార్టీపై తీవ్ర అసహనంతో ఉన్నారు.

Koneru Konappa : ఎమ్మెల్సీ ఎన్నికల వేళ కాంగ్రెస్ కు కోనేరు కోనప్ప ఝలక్..

Updated On : February 21, 2025 / 6:12 PM IST

Koneru Konappa : ఎమ్మెల్సీ ఎన్నికల వేళ కాంగ్రెస్ కు ఆ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఝలక్ ఇచ్చారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి ప్రసన్న హరిక్రిష్ణకు మద్దతు ప్రకటించారు కోనేరు కోనప్ప. అంతేకాకుండా ప్రసన్న హరిక్రిష్ణకు మద్దతుగా కొమురం భీం జిల్లా పెంచికల్ పేట్ లో ప్రచారం చేశారు.

ఇండైరెక్ట్ గా కాంగ్రెస్ అభ్యర్థిపై విమర్శలు గుప్పిస్తూ ప్రసన్న హరికృష్ణను గెలిపించాలని గ్రాడ్యుయేట్లను కోరారు కోనేరు కోనప్ప. గత కొంత కాలంగా కోనేరు కోనప్ప కాంగ్రెస్ పార్టీపై తీవ్ర అసహనంతో ఉన్నారు. ఈ క్రమంలోనే ఫిబ్రవరి 20వ తేదీన కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి ప్రచారానికి ఆయన డుమ్మా కొట్టారు. దీంతో త్వరలో కోనేరు కోనప్ప కాంగ్రెస్ ను వీడతారు అన్న ప్రచారం కొనసాగుతోంది.

Also Read : అధికారుల తీరు వల్లే ప్రభుత్వానికి చెడ్డ పేరు, వాళ్లే కోవర్టులు, చర్యలు తీసుకోవాల్సిన సమయం వచ్చింది- మధుయాష్కీ సంచలనం

”హరికృష్ణకు మద్దతుగా ప్రచారం చేసిన కోనేరు కోనప్ప.. హరికృష్ణ సేవా గుణం ఏంటో, ప్రత్యర్థి సేవా గుణం ఏంటో ఒకసారి విచారణ చేసుకోవాలన్నారు. విద్యార్థులను చదివించాలనే అకుంఠిత దీక్షతో పని చేసే వ్యక్తి. నిరుద్యోగ యువకులకు చేయూతనిచ్చే వ్యక్తి. కోచింగ్ సెంటర్లు పెట్టి నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చేలా కృషి చేసిన వ్యక్తి.

ఆయన ప్రత్యర్థి డబ్బు సంపాదనే ధ్యేయంగా ఉన్న వ్యక్తి. రేపు ఎన్నికల్లో హరికృష్ణ గెలిస్తే.. నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో ముందంజలో ఉంటారు. వేరే వాళ్లకు ఓట్లు వేస్తే తమ సంస్థలను బాగు చేసుకోవడానికి, సంస్థల ద్వారా డబ్బు సంపాదించుకోవడానికి మాత్రమే వారు శ్రద్ధ చూపిస్తారు. కానీ, యువకులకు ఏ విధంగానూ సాయం చేయరు” అని కోనేరు కోనప్ప అన్నారు.

రంగంలోకి దిగనున్న సీఎం రేవంత్ రెడ్డి..
మరోవైపు గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ఈ నెల 23, 24, 25వ తేదీలలో ప్రచారం చేయబోతున్నారు. ఆయా జిల్లాలలో పట్టభద్రులు, ఉపాధ్యాయులతో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక సమావేశాలు నిర్వహించబోతున్నారు. ఈ సమావేశాల్లో పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, మంత్రులు కూడా పాల్గొంటారు.