Water Dispute : కృష్ణా బోర్డు మీటింగ్..హాట్ హాట్‌గా వాదనలు

తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం కంటిన్యూ అవుతూనే ఉంది. కృష్ణా జలాల విషయంలో రాజుకున్న రగడ ఇప్పట్లో సద్దుమణిగేలా కనిపించడం లేదు.

Krishna board meeting : తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం కంటిన్యూ అవుతూనే ఉంది. కృష్ణా జలాల విషయంలో రాజుకున్న రగడ ఇప్పట్లో సద్దుమణిగేలా కనిపించడం లేదు. బుధవారం జరిగిన కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల ఉమ్మడి సమావేశం.. హాట్‌హాట్‌గా జరిగింది. హైదరాబాద్‌ జలసౌధలో జరిగిన సమావేశంలో.. తెలుగు రాష్ట్రాల అధికారులు.. తమ వాదనలను వాడీవేడిగా వినిపించారు. బోర్డుల ఛైర్మన్లు ఎంపీ సింగ్‌, చంద్రశేఖర్‌ అయ్యర్‌ నేతృత్వంలో జరిగిన ఉమ్మడి సమావేశంలో ఏపీ, తెలంగాణ అధికారులు పాల్గొన్నారు.

Read More : Cow Rights : ఆవుని జాతీయ జంతువుగా ప్రకటించి హక్కులు కల్పించాలి, హైకోర్టు కీలక వ్యాఖ్యలు

కేంద్రం జారీ చేసిన గెజిట్‌ నోటిఫికేషన్ అమలు కార్యాచరణపైనా భేటీలో చర్చించారు. జలవిద్యుత్‌ అంశంపై మరోమారు సమావేశంలో ప్రధానంగా చర్చ జరిగింది. విద్యుత్‌ అంశాన్ని పూర్తి చేద్దామని ఏపీ అధికారి శ్యామలరావు కోరగా.. ఇప్పటికే తమ అభిప్రాయం స్పష్టం చేశామని తెలంగాణ నీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్‌ తెలిపారు. మళ్లీ చర్చ అంటే మరోమారు సమావేశానికి రానని తెలిపారు. నిలబడే రజత్‌కుమార్‌ వాదనలు వినిపించారు.  కృష్ణా జలాల్లో యాబై శాతం వాటా కావాలని సమావేశంలో తెలంగాణ కోరింది.

Read More : White Rice : తీవ్ర విషాదం.. తెల్లబియ్యం తేలేదని భార్య ఆత్మహత్య

అయితే.. గతంలో మాదిరిగానే తెలంగాణకు 299, ఏపీకి 512 టీఎంసీల చొప్పున నీటి వాటాలు కొనసాగుతాయని.. వాటాలు ఖరారు చేసే అధికారం లేదని కృష్ణా బోర్డు తెలిపిందన్నారు తెలంగాణ నీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్‌. పోతిరెడ్డిపాడు నుంచి నీటిని తరలించకుండా చూడాలని వాదనలు వినిపించింది. గెజిట్‌ నోటిఫికేషన్‌లోని అభ్యంతరాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని.. శ్రీశైలంలో విద్యుత్‌ ఉత్పత్తికి ట్రైబ్యునల్‌ అనుమతులు ఉన్నాయంటోంది తెలంగాణ.

Read More : Mansukh Mandaviya : అరచేతిలో వ్యాక్సిన్ సమాచారం..కేంద్రఆరోగ్యశాఖ

వివరాలపై బోర్డు సానుకూలంగా స్పందించలేదని.. రెండు బోర్డులు కూడా పాత వాటినే కొనసాగించేందుకే మొగ్గు చూపాయని చెప్పారు రజత్‌కుమార్‌. మరోవైపు.. విద్యుత్‌ ఉత్పత్తి విషయంలో బోర్డు వైఖరికి నిరసనగా వాకౌట్‌ చేశారు తెలంగాణ అధికారులు.

ట్రెండింగ్ వార్తలు