Cow Rights : ఆవుని జాతీయ జంతువుగా ప్రకటించి హక్కులు కల్పించాలి, హైకోర్టు కీలక వ్యాఖ్యలు

భారతీయ సంస్కృతితో భాగమైన ఆవును జాతీయ జంతువుగా గుర్తించాలని అలహాబాద్ హైకోర్టు అంది. ఉత్తరప్రదేశ్ లో గోవధ నిరోధక చట్టం కింద

Cow Rights : ఆవుని జాతీయ జంతువుగా ప్రకటించి హక్కులు కల్పించాలి, హైకోర్టు కీలక వ్యాఖ్యలు

Cow

Cow Rights : భారతీయ సంస్కృతితో భాగమైన ఆవును జాతీయ జంతువుగా గుర్తించాలని అలహాబాద్ హైకోర్టు అంది. ఉత్తరప్రదేశ్ లో గోవధ నిరోధక చట్టం కింద నేరారోపణలు ఎదుర్కొన్న జావేద్ బెయిల్ నిరాకరిస్తూ కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ఆవులకు ప్రాథమిక హక్కులు కల్పించడానికి ప్రభుత్వం పార్లమెంటులో బిల్లును పాస్ చేయాలని సూచించింది. గోసంరక్షణ ఒక మతానికి సంబంధించినది కాదని, ఆవును పూజిస్తే దేశం అభివృద్ధి చెందుతుందని
హైకోర్టు వ్యాఖ్యానించింది. గోవు భారత సంస్కృతిలో భాగం, సంస్కృతిని పరిరక్షించడం మతాలకు అతీతంగా దేశంలోని ప్రతి పౌరుని బాధ్యత అని కోర్టు అంది.

Union Bank of India Jobs : రూ.78వేల జీతంతో 347 జాబ్స్.. రెండు రోజులే గడువు

బెయిల్ పిటిషన్ పై సింగిల్ బెంచ్ విచారించింది. జస్టిస్ శేఖర్ కుమార్ యాదవ్ సింగిల్ బెంచ్ కు నేతృత్వం వహించారు. ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా ఒక్క భారత్ లో మాత్రమే అన్ని మతాల ప్రజలు జీవిస్తున్నారని, ప్రార్థించే దేవుళ్లు వేరు అయినా, వారి ఆలోచన
మాత్రం ఒక్కటే అని జస్టిస్ యాదవ్ స్పష్టం చేశారు.

అటువంటి పరిస్థితిలో, ప్రతిఒక్కరూ భారతదేశాన్ని ఏకం చేయడానికి, దాని విశ్వాసానికి మద్దతివ్వడానికి ఒక అడుగు ముందుకు వేస్తారు. కానీ, కొంతమంది వ్యక్తుల విశ్వాసాలు, నమ్మకాలు దేశ ప్రయోజనాలకు విరుద్ధంగా ఉంటాయి. వారు ఇలా మాట్లాడటం ద్వారా దేశాన్ని బలహీనపరుస్తారు. ఈ పరిస్థితుల దృష్ట్యా, నిందితుడికి బెయిల్ మంజూరు చేస్తే అది సమాజం సామరస్యాన్ని పెద్దగా దెబ్బతీసే అవకాశం ఉందని కోర్టు అంది.

New PF Rule : పీఎఫ్ ఖాతాదారులకు అలర్ట్.. వెంటనే ఆ పని చేయకపోతే నష్టపోతారు

బార్ అండ్ బెంచ్ ప్రకారం, ఉత్తర ప్రదేశ్‌లో పనిచేస్తున్న గోశాలల కోర్టు వ్యాఖ్యానించింది. “ప్రభుత్వం గోశాలను నిర్మించింది. కానీ ఆవును జాగ్రత్తగా చూసుకోవాల్సిన వ్యక్తులు పట్టించుకోరు. అదే విధంగా, గో పరిరక్షణ పేరుతో ప్రజలు నుండి విరాళాలు, ప్రభుత్వం నుండి సహాయం తీసుకునే ప్రైవేట్ గోశాలలు కూడా నేడు కేవలం బూటకంగా మారాయి. అలా వచ్చిన డబ్బుని సొంత ఖర్చులకు వాడుకుంటున్నారు తప్ప గో సంరక్షణకు వాడటం లేదంది.