New PF Rule : పీఎఫ్ ఖాతాదారులకు అలర్ట్.. వెంటనే ఆ పని చేయకపోతే నష్టపోతారు

పీఎఫ్ ఖాతాదారులకు ముఖ్య గమనిక. తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయం. సెప్టెంబర్ 1 నుంచి ఈపీఎఫ్ రూల్ మారింది. ఉద్యోగులు త‌మ ఈపీఎఫ్ ఖాతాను ఆధార్‌తో లింక్ చేయాలి. లేదంటే నష్టపోతారు. పీఎఫ్

New PF Rule : పీఎఫ్ ఖాతాదారులకు అలర్ట్.. వెంటనే ఆ పని చేయకపోతే నష్టపోతారు

New Pf Rule

New PF Rule : పీఎఫ్ ఖాతాదారులకు ముఖ్య గమనిక. తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయం. సెప్టెంబర్ 1 నుంచి ఈపీఎఫ్ రూల్ మారింది. ఉద్యోగులు త‌మ ఈపీఎఫ్ ఖాతాను ఆధార్‌తో లింక్ చేయాలి. లేదంటే నష్టపోతారు. పీఎఫ్ ఖాతాను ఆధార్ తో అనుసంధానం చేయకపోతే కంపెనీ (య‌జ‌మాని) వాటా జమ కాదు.

Hyd Metro Sale : అమ్మకానికి హైదరాబాద్ మెట్రో.. వాటాలు విక్రయిస్తాం.. ఎల్అండ్‌టీ!

దీనికి సంబంధించి కొన్ని నెలల క్రితమే ఈపీఎఫ్‌ఓ ఉత్తర్వులు జారీ చేసింది. యూఏఎన్-ఆధార్ లింక్ కాకపోతే.. ఎల‌క్ట్రానిక్ చ‌లాన్ క‌మ్ రిట‌ర్న్ (ఈసీఆర్‌) భర్తీ కాదు. అంటే ఉద్యోగులు వారి సొంత పీఎఫ్ ఖాతాను చూడ‌గ‌లిగిన‌ప్ప‌టికీ, కంపెనీ వాటాను మాత్రం పొంద‌లేరు. ప్రావిడెంట్ ఫండ్ రెగ్యులేట‌ర్ కూడా అన్ని ఈపీఎఫ్ ఖాతాదారుల యూనివ‌ర్స‌ల్ అకౌంట్ నంబ‌ర్ (యూఏఎన్‌)- ఆధార్ అనుసంధానించాలని యాజమాన్య సంస్థలను ఆదేశించింది. ఇంత‌కు ముందు ఈపీఎఫ్ – ఆధార్ లింక్ కోసం 30 మే 2021 వ‌ర‌కు గ‌డువు ఉంది. ఆ త‌ర్వాత, గడువు తేదీని 2021 ఆగ‌స్టు 31 వ‌ర‌కు పొడిగించింది.

ఈపీఎఫ్‌లో ఉద్యోగికి కొవిడ్-19 అడ్వాన్స్ తీసుకోవ‌డం, పీఎఫ్ బీమా, ఇత‌ర పొదుపు ప‌థ‌కాల క‌న్నా అధిక వ‌డ్డీ రేటు పొంద‌డం వంటి అనేక ప్ర‌యోజ‌నాలు, ఉప‌యోగాలున్నాయి.

Life Expectancy : వాయుకాలుష్యంతో భారతీయుల ఆయుర్దాయం 9 ఏళ్లు తగ్గిపోవచ్చు!

ఈపీఎఫ్ – ఆధార్ లింక్ చేసే ప్రాసెస్..

* పీఎఫ్ పోర్ట‌ల్‌లో మీ ఈపీఎఫ్ ఖాతాకు లాగిన్ అవ్వండి.

* మీ `యూఏఎన్‌`, ఆధార్‌లో న‌మోదు చేసుకున్న మొబైల్ నంబ‌ర్‌ను న‌మోదు చేయండి.

* `జ‌న‌రేట్ ఓటీపీ`పై క్లిక్ చేయండి.

* ఓటిపీని పూర్తి చేసి జెండ‌ర్‌ను (లింగాన్ని) ఎంచుకోండి.

* ఆధార్ నంబ‌ర్ ఎంట‌ర్ చేసి `ఆధార్ వెరిఫికేష‌న్‌`ను ఎంచుకోండి.

* మొబైల్, ఈ-మెయిల్ ఆధారిత ధృవీక‌ర‌ణ ఎంపిక‌ను ఎంచుకోండి.

* మీ మొబైల్ నంబ‌ర్‌కు మ‌రో `ఓటీపీ` వ‌స్తుంది.

* 2వ `ఓటీపీ`ని న‌మోదు చేయండి.

* మీ ఈపీఎఫ్‌, యూఏఎన్ ఆధార్ సీడింగ్ ప్ర‌క్రియ‌ను పూర్తి చేయండి.