Life Expectancy : వాయుకాలుష్యంతో భారతీయుల ఆయుర్దాయం 9 ఏళ్లు తగ్గిపోవచ్చు!

భారతీయుల ఆయుర్దాయం తగ్గిపోతోంది. వాయు కాలుష్యమే దీనికి ప్రధాన కారణమని అంటోంది కొత్త అధ్యయనం.. వాయు కాలుష్య ప్రభావం మానవ మనుగడకు ప్రాణసంకటంగా మారుతోంది.

Life Expectancy : వాయుకాలుష్యంతో భారతీయుల ఆయుర్దాయం 9 ఏళ్లు తగ్గిపోవచ్చు!

Pollution May Cut Life Expectancy Of 40% Indians By 9 Years

Pollution May Cut Life Expectancy Of Indians : భారతీయుల ఆయుర్దాయం తగ్గిపోతోంది. వాయు కాలుష్యమే దీనికి ప్రధాన కారణమని అంటోంది కొత్త అధ్యయనం.. వాయు కాలుష్య ప్రభావం మానవ మనుగడకు ప్రాణసంకటంగా మారుతోంది. దేశ రాజధాని ఢిల్లీ సహా ఉత్తర భారతదేశంలో 480 మిలియన్లకు పైగా ప్రజలు గణనీయంగా అధిక వాయు కాలుష్యాన్ని ఎదుర్కొంటున్నారు. ఈ మేరకు యుఎస్ రీసెర్చ్ గ్రూప్ బుధవారం ఒక నివేదికను విడుదల చేసింది. దేశంలో సుమారు 40శాతం మంది భారతీయుల ఆయుర్దాయం తొమ్మిదేళ్లు తగ్గిపోయే అవకాశం ఉందని అధ్యయనంలో తేలింది. చికాగో యూనివర్శిటీలోని ఎనర్జీ పాలసీ ఇన్స్టిట్యూట్ (EPIC) ఈ అధ్యయనాన్ని నిర్వహించింది.

నివేదిక ప్రకారం.. దేశంలోని మిలియన్లకు పైగా ప్రజలు గణనీయంగా అధిక కాలుష్యాన్ని ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితి తీవ్ర ఆందోళనకరంగా ఉందని తెలిపింది. దేశంలో వాయు కాలుష్యం కాలక్రమంలో భౌగోళికంగా అధిక స్థాయిలో విస్తరించిందని EPIC నివేదిక వెల్లడించింది. మహారాష్ట్ర మధ్యప్రదేశ్‌లో గాలి నాణ్యత గణనీయంగా క్షీణించింది. ప్రమాదకరమైన కాలుష్య స్థాయిలను నియంత్రించడానికి 2019లో ఇండియన్ నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ (NCAP)ని ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని ECIC నివేదిక ప్రశంసించింది. NCAP లక్ష్యాలను సాధించడంతో దేశం మొత్తం ఆయుర్దాయం 1.7 సంవత్సరాలు పెరిగినట్టు గుర్తించింది.
Covid-19 Vaccine: కరోనా వ్యాక్సినేషన్‌లో భారత్ సరికొత్త రికార్డు..!

న్యూఢిల్లీలో 3.1 సంవత్సరాలు పెంచనుందని పేర్కొంది. 102 ప్రభావిత నగరాల్లో వాయు కాలుష్యాన్ని 20శాతం నుంచి 30శాతం ద్వారా 2024 నాటికి తగ్గించాలని NCAP లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా పారిశ్రామిక ఉద్గారాలు, వాహన ఎగ్జాస్ట్‌లలో కోతలను నిర్ధారిస్తుంది. రవాణా ఇంధనాలు, బయోమాస్ బర్నింగ్, దుమ్ము కాలుష్యంపై కఠినమైన నియమాలతో మెరుగైన పర్యవేక్షణ వ్యవస్థలను తీసుకొచ్చింది. ఊపిరితిత్తులను దెబ్బతీసే PM 2.5 వంటి గాలి కణాల నాణ్యత స్థాయిలను స్విస్ గ్రూపు IQAir ద్వారా కొలవవచ్చు. దీని ప్రకారం.. 2020లో వరుసగా మూడో ఏడాదిలోనూ ఢిల్లీ ప్రపంచంలోనే అత్యంత కలుషితమైన రాజధానిగా నిలిచింది.

గత ఏడాదిలో న్యూఢిల్లీలోని కరోనావైరస్ లాక్ డౌన్ ఆంక్షలతో నగరం వేసవిలో రికార్డు స్థాయిలో స్వచ్చమైన గాలిని పీల్చుకోగలిగింది. ఢిల్లీలోని 20 మిలియన్ల మంది నివాసితులు, సమీప రాష్ట్రాలైన పంజాబ్ హర్యానాలలో వ్యవసాయ అవశేషాలు బాగా పెరిగిపోయాయి. వీటి ప్రభావంతో శీతాకాలంలో విషపూరిత గాలితో నివాసితులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దేశంలో గాలి నాణ్యతను ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సు చేసిన స్థాయికి మెరుగుపర్చాల్సిన అవసరం ఉందని EPIC పేర్కొంది. అలాగే పొరుగున ఉన్న బంగ్లాదేశ్ సగటు ఆయుర్దాయం 5.4 ఏళ్లకు పెరుగుతోందని EPIC నివేదిక వెల్లడించింది.
LPG Cylinder Price : మళ్లీ పెరిగిన వంటగ్యాస్ సిలిండర్ ధర.. ఎంతంటే?