Covid-19 Vaccine: కరోనా వ్యాక్సినేషన్‌లో భారత్ సరికొత్త రికార్డు..!

Covid-19 వ్యాక్సినేషన్‌లో భారత్ రికార్డు సృష్టించింది. మంగళవారం (ఆగస్టు 31న) ఒక్కరోజులో అత్యధికంగా 1.33 కోట్ల మందికి టీకాలు అందాయి. దేశంలో 65.41 కోట్ల డోసుల టీకాలను పంపిణీ చేసింది.

Covid-19 Vaccine: కరోనా వ్యాక్సినేషన్‌లో భారత్ సరికొత్త రికార్డు..!

Covid 19 Vaccination

Covid-19 vaccination drive: Covid-19 వ్యాక్సినేషన్‌లో భారత్ రికార్డు సృష్టించింది. మంగళవారం (ఆగస్టు 31న) ఒక్కరోజులో అత్యధికంగా 1.33 కోట్ల మందికి టీకాలు అందాయి. ఇప్పటివరకూ దేశంలో 65.41 కోట్ల డోసుల టీకాలను పంపిణీ చేసింది. ఆగస్టు నెలలో 18.3 కోట్ల టీకాలను పంపిణీ చేసింది. దేశంలో కరోనావైరస్‌ నిర్మూలనే ధ్యేయంగా ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతోంది. గత 228 రోజులుగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ మరింత వేగవంతమైంది. మంగళవారం ఒక్కరోజే 1,33,18,718 డోసుల కరోనా టీకానలు అందించింది. ఇప్పటివరకూ దేశవ్యాప్తంగా 65,41,13,508 కరోనా టీకా డోసులను పంపిణీ చేసినట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. రికార్డ్ స్థాయిలో వ్యాక్సినేషన్ అందించడంతో మొత్తంగా 1,30,82,756 వ్యాక్సిన్లు పంపిణీ అయ్యాయి.

50 కోట్ల మందికి మొదటి డోసు పూర్తి :
ఇప్పటి వరకు 50 కోట్ల మందికి వ్యాక్సిన్ మొదటి డోస్ వేసినట్టు మంత్రిత్వ శాఖ చెబుతోంది. ‘దేశం సరికొత్త రికార్డ్ సృష్టించింది. వ్యాక్సినేషన్ కార్యక్రమంలో 1.30 లక్షల టీకాలు వేసి సరికొత్త రికార్డును భారత్ సృష్టించింది. దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం వేగంగా కొనసాగుతోంది. కోటికి పైగా టీకా వేయడం జరుగుతోంది. ఈ టీకా పంపిణీల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది’ అని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ట్వీట్ చేశారు. కోవిడ్ వారియర్స్‌ని ఆరోగ్య మంత్రి ప్రశంసలతో ముంచెత్తారు. ‘ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ కార్యక్రమం జరుగుతోంది. ఈ కార్యక్రమం మరో మైలురాయి చేరుకుంది. కొవిడ్-19 వ్యాక్సిన్ మొదటి డోస్ 50 కోట్ల మంది అందుకున్నారు. ఈ గొప్ప విజయాన్ని సాధించడంలో కొవిడ్ వారియర్స్ సహా సాయపడిన వారందరికీ అభినందనలు’ అంటూ ట్వీట్ చేశారు.
Covid – 19 : భారత్ లో పెరిగిన కరోనా కొత్త కేసులు, మరణాలు

దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. కరోనా కేసుల సంఖ్య బుధవారం మళ్లీ పెరిగింది. 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 41,965 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇందులో 70 శాతం కేసులు ఒక్క కేరళలోనే నమోదయ్యాయి. కేరళలో 30,203 కేసులు వెలుగుచూశాయి. తాజా కేసులతో కలిపి దేశంలో మొత్తం 3,28,10,845 కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో కరోనాతో 460 మంది మృతి చెందారు. ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 4,39,020 చేరింది. గడిచిన 24 గంటల్లో కరోనా నుంచి కోలుకొని 33,964 డిశ్చార్జ్ అయ్యారు. కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 3,19,93,644 కు చేరింది. ఇక రికవరీ రేటు 97.51శాతానికి చేరింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 3,78,181 మంది వైరస్‌తో
బాధపడుతున్నారు.. కరోనా యాక్టివ్ కేసుల రేటు 1.15శాతంగా నమోదైంది.
LPG Cylinder Price : మళ్లీ పెరిగిన వంటగ్యాస్ సిలిండర్ ధర.. ఎంతంటే?