×
Ad

నేను రెడీ.. మీరు రెడీనా?: లై డిటెక్టర్ టెస్ట్‌కు రావాలంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్.. ఎందుకంటే?

కాంగ్రెస్ లేకపోతే ముస్లింలు లేరన్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తున్నానని కేటీఆర్ చెప్పారు.

KTR: “రేవంత్ రెడ్డి మగాడైతే లై డిటెక్టర్ టెస్ట్‌కు రావాలి” అంటూ తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు. “తనపై ఉన్న ఏసీబీ కేసులో రేవంత్ వస్తే.. ఫార్ములా ఈ రేస్ కేసులో నేను లై డిటెక్టర్ టెస్ట్‌కు రెడీ” అని చెప్పారు.

ఇవాళ హైదరాబాద్‌లో తెలంగాణ భవన్‌లో కేటీఆర్ మాట్లాడుతూ.. ఫార్ములా-ఈ రేసు కేసులో విషయం లేదు కాబట్టే గవర్నర్ అనుమతి ఇవ్వాలంటూ రేవంత్‌ రెడ్డి నాన్చుతున్నారని చెప్పారు. తన ప్రాసిక్యూషన్‌కు గవర్నర్ ఎప్పుడో అనుమతి ఇచ్చారని అన్నారు. (KTR)

Also Read: ఈ బ్రెజిల్ మోడల్ హరియాణా ఎన్నికల్లో 22 ఓట్లు వేసిందట.. స్వీటీ, సీమ, సరస్వతి పేర్లతో..: రాహుల్ ‘హెచ్ ఫైల్స్’ స్పీచ్ హైలైట్స్ ఇవే..

కాంగ్రెస్ లేకపోతే ముస్లింలు లేరన్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తున్నానని కేటీఆర్ చెప్పారు. ఇటువంటి కామెంట్లు చేసిన రేవంత్ రెడ్డి ముస్లింలను అవమానించారని అన్నారు.

ముస్లిం సమాజానికి సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. క్షమాపణలు చెప్పకపోతే కాంగ్రెస్‌కు ఎలా సమాధానం చెప్పాలో ప్రజలు నిర్ణయించుకుంటారని అన్నారు.

కాంగ్రెస్ పుట్టకముందు నుంచీ ముస్లింలు ఉన్నారని, సీఎం రేవంత్ తన అజ్ఞానం నుంచి బయటకు రావాలని కేటీఆర్ వ్యాఖ్యానించారు. బీజేపీ లేకపోయినా హిందువులు ఉంటారని, కాంగ్రెస్ లేకపోయినా ముస్లింలు ఉంటారని చెప్పారు.