KTR: అసలు అవినీతే లేనప్పుడు.. కేసు ఎక్కడది?: కేటీఆర్

తనపై ఇది ఆరో ప్రయత్నమని, రేవంత్ కు ఏమీ దొరకటం లేదని కేటీఆర్ అన్నారు.

ఫార్ములా ఈ రేసు కేసులో హైకోర్టులో ఏం తీర్పు వస్తుందో చూద్దామని తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ఇవాళ కేటీఆర్ మీడియాతో చిట్‌చాట్‌లో పాల్గొన్నారు. అవినీతే లేనప్పుడు.. కేసు ఎక్కడదని ప్రశ్నించారు.

ఏసీబీ ఎఫ్ఐఆర్ తప్పని, 7న ఈడీ విచారణకు హాజరుపై మా లాయర్లు నిర్ణయిస్తారని కేటీఆర్ అన్నారు. ఏసీబీ కేసులో అస్సలు పస లేదని, తనకు న్యాయస్థానాల మీద నమ్మకం ఉందని చెప్పారు. ఫార్ములా ఈ కేసు లొట్టపీసు కేసని అన్నారు. తనను ఏదో రకంగా జైలుకు పంపాలని ప్రభుత్వం చూస్తోందని వ్యాఖ్యానించారు.

తనపై ఇది ఆరో ప్రయత్నమని, రేవంత్ కు ఏమీ దొరకటం లేదని కేటీఆర్ అన్నారు. రూ.600 కోట్ల సంగతి అటుంచితే.. ఒక్క పైసా కూడా అవినీతి లేదని చెప్పారు. జడ్జి అడిగే ప్రశ్నలకు ఏజీ దగ్గర సమాధానం లేదని అన్నారు. రేసు కావాలని తాను నిర్ణయం తీసుకున్నానని, వద్దనేది రేవంత్ నిర్ణయమని చెప్పారు.

ఇద్దరి నిర్ణయాలపై క్యాబినెట్ లో చర్చ జరగలేదని కేటీఆర్ అన్నారు. తనపై కేసు పెడితే.‌. రేవంత్ పై కూడా కేసు పెట్టాలని చెప్పారు. కాగా, కేటీఆర్ వేసిన క్వాష్‌ పిటిషన్‌పై నిన్న హైకోర్టులో వాదనలు ముగిసిన విషయం తెలిసిందే. తీర్పును హైకోర్టు రిజర్వ్‌ చేసింది.

Chandrababu Naidu: వారిని కంట్రోల్ చేస్తున్నా.. పదే పదే హెచ్చరిస్తున్నా: చంద్రబాబు