KTR: రాష్ట్ర ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోంది: కేటీఆర్

రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే వాళ్లను జైళ్లకు పంపుతున్నారని కేటీఆర్ అన్నారు.

KTR

రాష్ట్ర ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. అసెంబ్లీ వద్ద కేటీఆర్ మాట్లాడుతూ.. “రేవంత్ రెడ్డికి మనసు ఉందా? తన నియోజకవర్గ ప్రజలు జైల్లో ఉంటే టూరిజం పాలసీ అసెంబ్లీలో పెట్టారు. తనకు ఓట్లు వేసి గెలిపించిన ప్రజలు జైల్లో ఉంటే రేవంత్ రెడ్డి టూర్లు కొడుతున్నారు.

రేవంత్ రెడ్డి తనపై ఎవరైనా మాట్లాడితే వాళ్లను జైళ్లకు పంపుతున్నారు. తమ భూమి రైతులు ఇవ్వాలని అంటే జైల్లో పెట్టడానికి రేవంత్ రెడ్డి ఎవరు? లగచర్లలో జరిగిన అరాచకంపై అసెంబ్లీలో చర్చ పెట్టమని అడిగితే వాయిదా వేసుకుని పారిపోయారు. లగచర్లలో ఫార్మా విలేజ్ ప్రతిపాదనను వెనక్కి తీసుకుని ఇండ్రస్ట్రీయల్ పార్క్ పేరుతో భూములు లాక్కోవాలని చూస్తున్నారు. లగచర్లలో అనుముల తిరుపతి రెడ్డి కనుసన్నల్లో పోలీసులు నడుస్తున్నారు. రాజ్యాంగేతర శక్తిగా అనుముల తిరుపతి రెడ్డి వ్యవహరిస్తున్నారు.

బీఆర్ఎస్ ప్రభుత్వం ఫార్మా సిటీ కోసం 14 వేల ఎకరాలు సేకరించింది. రాష్ట్రంలో ఉన్నది ప్రజాస్వామ్య ప్రభుత్వం కాదు నియంతృత్వ ప్రభుత్వం. లగచర్ల రైతులపై పెట్టిన కేసులు ఎత్తివేసి జైలు నుంచి విడుదల చేసే దాక బీఆర్ఎస్ పోరాటం చేస్తుంది. జైల్లో ఉన్న లగచర్ల రైతుకు గుండెపోటు వస్తే బేడీలు వేసి ఆసుపత్రికి తీసుకువెళ్లారు” అని కేటీఆర్ అన్నారు.

Chandrababu Naidu: దీన్ని రాష్ట్రానికి గేమ్ చేంజర్‌లా చేస్తాం: చంద్రబాబు