KTR: రేవంత్ రెడ్డి బావమరిదికి ఆ పనులు అప్పజెప్పారు: కేటీఆర్ సంచలన కామెంట్స్

కేంద్రం సైలెంట్‌గా ఉంటే ఇద్దరు మిలాఖత్ అయినట్లేనని, టెండర్లను వెంట..

KTR

తెలంగాణలో రేవంత్ సకుటుంబ సపరివార కుంభకోణాలు జరుగుతున్నాయని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. రేవంత్ సీఎం అయిన వెంటనే కుంభకోణానికి తెరలేచిందని, అమృత్ టెండర్లలో సీఎం కుటుంబ సభ్యులు కుంభకోణానికి పాల్పడ్డారని అన్నారు.

సృజన్ రెడ్డికి పనులు దక్కేలా రేవంత్ రెడ్డి చూశారని, ఈహెచ్‌పీ కంపెనీ 20 శాతం పనులు మాత్రమే చేపడుతామని లేఖ రాసిందని తెలిపారు. బావమరిది కళ్లల్లో ఆనందం కోసం అమృత్ టెండర్లలో అక్రమాలకు తెరలేపారని అన్నారు. 8,888 కోట్ల రూపాయల టెండర్లు రహస్యంగా జరిగాయని, కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కు కాకపోతే టెండర్లపై కేంద్రం విచారణ చేయాలని డిమాండ్ చేశారు.

కేంద్రం సైలెంట్ గా ఉంటే ఇద్దరు మిలాఖత్ అయినట్లేనని, టెండర్లను వెంటనే రద్దు చేయాలని అన్నారు. ఇలాంటి కుంభకోణాలను బయటపెడుతూ ధారావహికంగా విడుదల చేస్తామని, సీఎం రేవంత్ ఈ కేసు నుంచి తప్పించుకోలేరని చెప్పారు.

సీఎం ప్రమేయం లేకుండా ఇది జరగదని, బావమరిది కంపెనీకి పనులు ఇచ్చి జవోలు ఎందుకు బయట పెట్టడంలేదని కేటీఆర్ నిలదీశారు. కాంగ్రెస్ సీఎంపై బీజేపీకి ప్రేమ లేకపోతే విచారణ ఎందుకు చేయదని ప్రశ్నించారు. కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ లో కూడా అక్రమాలకు పాల్పడ్డారని, ఇవి కూడా త్వరలో బయట పెడుతామని తెలిపారు.

మళ్లీ మొదలు.. కోకాపేట్‌లో అక్రమ నిర్మాణాలు కూల్చివేత.. ఆక్రమణదారులకు సీరియస్ వార్నింగ్..