మళ్లీ మొదలు.. కోకాపేట్‌లో అక్రమ నిర్మాణాలు కూల్చివేత.. ఆక్రమణదారులకు సీరియస్ వార్నింగ్..

ఇప్పటికే హైదరాబాద్ నగర వ్యాప్తంగా అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది. ప్రభుత్వ భూములు, చెరువులను కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారికి గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది హైడ్రా.

మళ్లీ మొదలు.. కోకాపేట్‌లో అక్రమ నిర్మాణాలు కూల్చివేత.. ఆక్రమణదారులకు సీరియస్ వార్నింగ్..

Updated On : September 21, 2024 / 4:23 PM IST

Demolitions In Kokapet : చెరువులు, ప్రభుత్వ ఆస్తులే పరిరక్షణ లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం దూసుకెళ్తోంది. హైదరబాద్ నగర పరిధిలో ప్రభుత్వ ఆస్తులు కబ్జా చేసిన ప్రాంతంలో కొరడా ఝళిపిస్తోంది. తాజాగా రంగారెడ్డి జిల్లా కోకాపేట్ లో అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపారు అధికారులు. కోకాపేట్ సర్వే నెంబర్ 147 కొంతమంది భూబకాసురులు సుమారు రూ.10 కోట్ల విలువ చేసే 800 గజాల ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేపట్టారు.

స్థానికుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన రెవెన్యూ, మున్సిపల్ సిబ్బంది.. జేసీబీల సాయంతో అక్రమ నిర్మాణాలను కూల్చేశారు. తిరిగి నిర్మాణాలు చేపడితే కఠినమైన చర్యలు తీసుకుంటామని, క్రిమినల్ కేసులు సైతం నమోదు చేస్తామని హెచ్చరించారు.

ఇప్పటికే హైదరాబాద్ నగర వ్యాప్తంగా అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది. ప్రభుత్వ భూములు, చెరువులను కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారికి గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది హైడ్రా. అక్రమ నిర్మాణాలు ఉన్న చోట నోటీసులు అంటిస్తోంది. ఇచ్చిన గడువులోగా స్పందించకుంటే బుల్డోజర్ల సాయంతో అక్రమ నిర్మాణాలను కూల్చేస్తున్నారు.

Also Read : కాంగ్రెస్‍లో హాట్ టాపిక్‌గా మారిన కొత్త రూల్..! ఇంతకీ పీసీసీ చీఫ్ ప్లాన్ ఏంటి?

ఇప్పటికే చాలా ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలను కూల్చేసింది హైడ్రా. మరోవైపు హైడ్రాకు పూర్తి స్థాయి స్వేచ్చను కల్పిస్తూ రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. హైడ్రాకు చట్టబద్ధత కల్పించాలనే నిర్ణయం తీసుకుంది.