ktr fires on bjp: తెలంగాణ ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ బీజేపీపై ఫైర్ అయ్యారు. చిల్లర మాటలు మాట్లాడితే ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చారు. నోరు అదుపులో పెట్టుకోవాలని బీజేపీ నేతలకు సూచించారు. సీఎం కేసీఆర్ పై ఇష్టానుసారం మాట్లాడితే ఊరుకునేది లేదన్నారు కేటీఆర్. మా ఓపికకూ ఓ హద్దు ఉంటుందన్నారు.
బీజేపీ నేతలు సమాజంలో తక్కువ, సోషల్ మీడియాలో ఎక్కువగా ఉంటారని ఎద్దేవా చేశారు. గోబెల్స్ కే పాఠాలు నేర్పే స్థాయికి బీజేపీ చేరిందన్నారు. వాట్సాప్ యూనివర్సిటీలో బీజేపీ నేతలు సిద్ధహస్తులు అంటూ సెటైర్లు వేశారు కేటీఆర్. దుబ్బాక ఉపఎన్నికలో గెలుపు టీఆర్ఎస్ దే అని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. భారీ మెజార్టీతో టీఆర్ఎస్ గెలుస్తుందన్నారు. కాంగ్రెస్, బీజేపీకి డిపాజిట్లు కూడా దక్కవని కేటీఆర్ జోస్యం చెప్పారు. కాంగ్రెస్ నేతలకు దుబ్బాకలో మిగిలేది ఏమీ లేదన్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో ఎన్నికలు ఏవైనా గెలుపు టీఆర్ఎస్ దే అని కేటీఆర్ గుర్తు చేశారు. ఇప్పుడు దుబ్బాక బై పోల్స్ లోనూ అదే జరుగుతుందన్నారు.