Globerina Controversy: గ్లోబేరినా వివాదంలో సీఎం రేవంత్ కి బిగ్ షాక్.. 48 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. లీగల్ నోటీసులు పంపిన కేటీఆర్

గ్లోబేరినా టెక్నాలజీస్(Globerina Controversy) వ్యవహారంలో తనపై అసత్య ఆరోపణలు చేశారంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ లీగల్ నోటీసులు జారీ చేశారు.

ktr issues legal notice to cm revanth reddy over globerina allegations

  • సీఎం రేవంత్‌రెడ్డికి లీగల్ నోటీసులు
  • 48 గంటల్లో క్షమాపణ చెప్పాలి
  • లేదంటే పరువు నష్టం దావా

Globerina Controversy: తెలంగాణ రాజకీయం మరోసారి హీటెక్కింది. గ్లోబేరినా టెక్నాలజీస్ వ్యవహారంలో తనపై అసత్య ఆరోపణలు చేశారంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారకరామారావు లీగల్ నోటీసులు జారీ చేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండా మీడియా ముఖంగా తనపై తప్పుడు ప్రచారం చేశారని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే 48 గంటల్లో రేవంత్ రెడ్డి బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆ నోటీసులో స్పష్టంగా డిమాండ్ చేశారు.

Delhi Police: ఢిల్లీలో జాతీయ భద్రతా చట్టం అమలు.. 6:30 నుంచి ఆంక్షలు.. భారీగా బలగాల మోహరింపు.. అసలు ఏం జరుగుతోంది?

గ్లోబేరినాతో ఎలాంటి సంబంధం లేదు:

గ్లోబేరినా(Globerina Controversy) సంస్థతో తనకు ఎలాంటి ఆర్థిక లావాదేవీలుగానీ లేదా యాజమాన్య హక్కులుగానీ లేవని కేటీఆర్ స్పష్టం చేశారు. సదరు సంస్థ తన బినామీ కంపెనీ అని, దానికి సీబీఎస్ఈ కాంట్రాక్టులు ఇప్పించానని సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలన్నీ పూర్తిగా అవాస్తవాలని ఖండించారు. అత్యున్నత రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి ఇలాంటి ఆధార రహిత, బాధ్యతారహిత వ్యాఖ్యలు చేయడం ఎంతమాత్రం తగదని ఆయన హితవు పలికారు.

క్షమాపణ చెప్పకుంటే పరువు నష్టం దావా!

కేవలం రాజకీయ లబ్ధి పొందడం కోసం, తన వ్యక్తిగత ప్రతిష్టను దిగజార్చే దురుద్దేశంతోనే ముఖ్యమంత్రి ఈ తప్పుడు వ్యాఖ్యలు చేశారని కేటీఆర్ ఆరోపించారు. ఇచ్చిన గడువులోగా రేవంత్ రెడ్డి బహిరంగంగా క్షమాపణ చెప్పకపోతే, తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. చట్టప్రకారం సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకోవడంతో పాటు భారీ మొత్తంలో పరువు నష్టం దావా వేస్తామని లీగల్ నోటీసు ద్వారా కేటీఆర్ స్పష్టం చేశారు.