Delhi Police: ఢిల్లీలో జాతీయ భద్రతా చట్టం అమలు.. 6:30 నుంచి ఆంక్షలు.. భారీగా బలగాల మోహరింపు.. అసలు ఏం జరుగుతోంది?
ఢిల్లీల పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు 'జాతీయ భద్రతా చట్టం' (Delhi Police) కింద ముందస్తు అరెస్టులు చేసే అపరిమిత అధికారాలను కల్పిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.
Delhi police granted nsa powers amid cjp protests at jantar mantar
- జంతర్ మంతర్ వద్ద నిరసనలు
- కన్నాట్‌ప్లేస్‌లో దుకాణాలు ముందస్తు బంద్
- పోలీసులకు జాతీయ భద్రతా చట్టం
Delhi Police: దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) చేపడుతున్న ఆందోళనలు తీవ్రరూపం దాల్చడంతో నగరంలో ఒక్కసారిగా తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నిరసనలు ఉధృతమవుతున్న నేపథ్యంలో శాంతిభద్రతలను కాపాడేందుకు, అవాంఛనీయ సంఘటనలను అరికట్టేందుకు అధికారులు కఠిన చర్యలు చేపట్టారు. ప్రధానంగా వ్యాపార కేంద్రమైన కన్నాట్ ప్లేస్ ప్రాంతంలోని అన్ని దుకాణాలు, రెస్టారెంట్లు, కార్యాలయాలను గురువారం సాయంత్రం 6:30 గంటలకల్లా పూర్తిగా మూసివేయాలని న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ వ్యాపారులను ఆదేశించింది.
కన్నాట్‌ప్లేస్ బంద్: NDTA కీలక నిర్ణయం:
మున్సిపల్ కౌన్సిల్ ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరిపిన అనంతరం న్యూఢిల్లీ ట్రేడర్స్ అసోసియేషన్ వ్యాపారులకు సర్క్యులర్ జారీ చేసింది. ఆందోళనకారుల వల్ల ఆస్తి నష్టం లేదా పౌరులకు ఎలాంటి గాయాలు కాకుండా చూసేందుకే సాయంత్రం 6:30 గంటలకల్లా షాపులు మూసివేయాలని నిర్ణయించినట్లు NDTA అధ్యక్షుడు అతుల్ భార్గవ తెలిపారు. వ్యాపారులందరూ ఈ భద్రతా చర్యలకు సహకరించాలని ఆయన కోరారు. ఆందోళనల వేళ ఈ ఆకస్మిక ముగింపు నిర్ణయం స్థానికంగా పెద్ద ఎత్తున ప్రాధాన్యత సంతరించుకుంది.
NSA అమల్లోకి: కేజ్రీవాల్ సంచలన అనుమానాలు:
పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ఢిల్లీ పోలీసులకు ‘జాతీయ భద్రతా చట్టం’ (Delhi Police) కింద ముందస్తు అరెస్టులు చేసే అపరిమిత అధికారాలను కల్పిస్తూ జూలై 19 నుంచి అక్టోబర్ 18 వరకు అమల్లో ఉండేలా ఉత్తర్వులు ఇచ్చారు. కాగా, ఈ భద్రతా ఏర్పాట్లు, భారీగా బలగాల మోహరింపు, అంబులెన్సుల రాకపై ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ తీవ్ర అనుమానాలు వ్యక్తం చేశారు. నిరసన తెలుపుతున్న విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకోవడానికే కేంద్ర ప్రభుత్వం ఇలాంటి సైనిక స్థాయి ఏర్పాట్లు చేస్తోందా అని ఆయన ప్రశ్నించారు.
