×
Ad

KTR : సిరిసిల్లకు మెగా పవర్‌లూమ్‌ క్లస్టర్‌ మంజూరు చేయండి.. కేంద్రానికి కేటీఆర్‌ మరో లేఖ

తెలంగాణ ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌కు మరోసారి లేఖ రాశారు. సమీకృత మరమగ్గాల క్లస్టర్‌ అభివృద్ధి పథకం (సీపీసీడీఎస్‌) కింద సిరిసిల్లలో మెగా పవర్‌లూమ్..

  • Published On : November 14, 2021 / 04:50 PM IST

Ktr

KTR : తెలంగాణ ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌కు మరోసారి లేఖ రాశారు. సమీకృత మరమగ్గాల క్లస్టర్‌ అభివృద్ధి పథకం (సీపీసీడీఎస్‌) కింద సిరిసిల్లలో మెగా పవర్‌లూమ్‌ క్లస్టర్‌ మంజూరు చేయాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. గతంలో పలుసార్లు లేఖలు రాశామని, వ్యక్తిగతంగా సమావేశమైన సమయంలోనూ ఈ విషయమై గుర్తు చేసినా దురదృష్టవశాత్తు కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. కొన్ని దశాబ్దాలుగా సిరిసిల్ల చేనేత, జౌళి రంగానికి ప్రధాన కేంద్రంగా ఉందని మంత్రి కేటీఆర్‌ తెలిపారు.

WhatsApp Feature: వాట్సప్‌లో కొందరికి మాత్రమే కనిపించకుండా లాస్ట్ సీన్ హైడ్ ఆప్షన్

మెగా పవర్‌లూమ్‌ క్లస్టర్‌ ఏర్పాటుకు అవసరమైన వ్యవస్థ, శిక్షణ పొందిన మానవ వనరులున్నాయని కేటీఆర్ చెప్పారు. పట్టణంలో చేనేత కార్మికులకు ఉపాధిని కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని కేటీఆర్ తెలిపారు. చేనేత, జౌళి రంగం సర్వతోముఖాభివృద్ధికి, నేత కార్మికుల శ్రేయస్సు కోసం తెలంగాణ అనేక పథకాలు తీసుకొచ్చిందన్నారు. 40శాతం ఇన్‌ఫుట్‌ సబ్సిడీ వేజ్ కాంపెన్సేషన్ స్కీమ్, థ్రిఫ్ట్‌ఫండ్‌ తదితర పథకాలతో చేనేత, పవర్‌లూమ్‌ కార్మికులకు నిరంతరం పని అందించి ఆదాయం పెంపునకు కృషి చేస్తున్నట్లు వివరించారు. గతంలో పలు సందర్భాల్లో తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చర్యలు, కార్యక్రమాలను కేంద్రం ప్రశంసించిన విషయాన్ని గుర్తు చేశారు.

Tongue Color : ఆరోగ్యాన్ని చెప్పే నాలుక రంగు..

తెలంగాణ రాష్ట్రానికి, చేనేత, జౌళి రంగానికి సంబంధించి కేంద్రం నుంచి చెప్పుకోదగ్గ సహకారం అందించకపోవడంపై మంత్రి కేటీఆర్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణ వంటి ప్రగతి శీల రాష్ట్రాలకు కేంద్రం ఆదరణ కల్పించకపోవడంతో నేడు మన దేశం చిన్న దేశాలతో కూడా పోటీపడలేకపోతోందన్నారు. అదే సమయంలో తెలంగాణ టెక్స్‌టైల్‌ రంగంలో పలు పెట్టుబడులను ఆకర్షించగలిగిందన్న విషయాన్ని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం చేనేత, జౌళి రంగానికి అదనపు బడ్జెట్‌ను కేటాయించిందని, కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌ వంటి ప్రపంచస్థాయి ప్రాజెక్టులను చేపట్టిందని చెప్పారు.

మెగా పవర్‌లూమ్‌ క్లస్టర్‌ వంటి ప్రాజెక్టుల ద్వారా ఏర్పడే ఉపాధి అవకాశాల కోసం తెలంగాణ యువత ఆసక్తిగా ఎదురుచూస్తోందని.. ఇకనైనా ఆలస్యం చేకుండా మెగా పవర్‌ లూమ్ క్లస్టర్‌ ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రజల తరఫున విజ్ఞప్తి చేస్తున్నా అని కేటీఆర్ అన్నారు. అదే సమయంలో అవసరమైన పర్యావరణ వ్యవస్థ లేదా వనరులు లేని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం పథకాలు, సాయాన్ని ప్రకటిస్తున్న విషయాన్ని కొన్నేళ్లుగా గమనిస్తున్నామన్న మంత్రి కేటీఆర్‌.. దీని వల్ల వేగంగా అభివృద్ధి చెందుతున్న తెలంగాణ వంటి రాష్ట్రాలకు నష్టమన్నారు.