×
Ad

వారిని హెచ్చరిస్తున్నా.. వచ్చేది మా ప్రభుత్వమే: కేటీఆర్

వాయిదా పడిన మునిసిపాలిటీల్లో వెంటనే ఎన్నికలు నిర్వహించాలని కోరారు. అధికార పార్టీకి వత్తాసు పలకవద్దని అధికారులను హెచ్చరించారు.

KTR: కాంగ్రెస్ చిల్లర, చండాలపు రాజకీయాలు చేస్తోందని తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. క్యాతన్ పల్లిలో ఒక కౌన్సిలర్‌కు మంత్రి 3 కోట్ల రూపాయల ఆఫర్ ఇచ్చినా లొంగలేదని ఆరోపించారు. పొత్తు ధర్మం పాటించినందుకు సీపీఐ మిత్రులకు ధన్యవాదాలు తెలిపారు.

సుమన్‌కు జైలు కొత్త కాదని వ్యాఖ్యానించారు. త్వరలోనే మంత్రి వివేక్‌కు చిప్పకూడు తినిపిస్తామని హెచ్చరించారు. రాష్ట్రంలో తాము 30 వరకు మునిసిపాలిటీలు గెలవాల్సి ఉందన్నారు.

Also Read: దేవ్‌జీ సహా లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేతలు.. వివరాలు తెలిపిన డీజీపీ

“డీజీపీ, సీఎంకు హెచ్చరిక చేస్తున్నా. అరాచకాలు ఆపాలి. వచ్చేది మా ప్రభుత్వమే. చట్టం, రాజ్యాంగాన్ని గౌరవించాలి. చట్టాన్ని తుంగలో తొక్కవద్దు” అని అన్నారు.

వాయిదా పడిన మునిసిపాలిటీల్లో వెంటనే ఎన్నికలు నిర్వహించాలని కోరారు. అధికార పార్టీకి వత్తాసు పలకవద్దని అధికారులను హెచ్చరించారు. క్యాతన్ పల్లిలో కాంగ్రెస్ నాయకులపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.

హాలులో సీసీటీవీ దృశ్యాలు పరిశీలించి కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని సూచించారు. తమపై అక్రమ కేసులు పెట్టవద్దని అన్నారు. నిజాలు బయటపెట్టిన మీడియాకు ధన్యవాదాలు తెలిపారు.