కవితను కలిసిన కేటీఆర్.. సోమవారం ముగియనున్న సీబీఐ కస్టడీ

MLC Kavitha: గతంలో ఈడీ కస్టడీలో ఉన్నప్పుడు కూడా ఈడీ కార్యాలయంలో కవితను కలిశారు కేటీఆర్.

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీబీఐ కస్టడీలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ ఇవాళ కలిశారు. సీబీఐ కేంద్ర కార్యాలయంలో కవితను కేటీఆర్ కలవడం ఇదే తొలిసారి. కేటీఆర్ తో పాటు కవిత భర్త అనిల్, న్యాయవాది మోహిత్ రావు కూడా ఉన్నారు.

కవితకు కేటీఆర్ ధైర్యం చెప్పారు. లిక్కర్ కేసులో న్యాయపోరాటంపై కవితతో కేటీఆర్ చర్చించారు. సీబీఐ కస్టడీ సమయంలో ప్రతిరోజూ గంటపాటు కుటుంబ సభ్యులను కవిత కలిసేందుకు వెసులుబాటు ఉంది. గతంలో ఈడీ కస్టడీలో ఉన్నప్పుడు కూడా ఈడీ కార్యాలయంలో కవితను కలిశారు కేటీఆర్.

కస్టడీ పొడిగింపు?
కవిత సీబీఐ కస్టడీ రేపటితో ముగియనుంది. రేపు ఉదయం రౌస్ అవెన్యూ కోర్టులో జడ్జి కావేరి భవేజా ముందు కవితను సీబీఐ ప్రవేశపెట్టనుంది. లిక్కర్ పాలసీ సీబీఐ కేసు దర్యాప్తు పురోగతిని కోర్టుకు అధికారులు వివరిస్తారు. కవిత సీబీఐ కస్టడీ పొడిగింపు లేదా జ్యుడీషియల్ కస్టడీకి పంపాలని అధికారులు కోరే అవకాశం ఉంది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఏప్రిల్ 11న తీహార్ జైలులో కవితను అరెస్ట్ చేసింది సీబీఐ. కవితకు వ్యతిరేకంగా ఆధారాలు ఉన్నాయని సీబీఐ చెప్పింది.


Also Read: వరంగల్ జిల్లా బీఆర్ఎస్‌లో కీలక పరిణామం

ట్రెండింగ్ వార్తలు