KTR: పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ సిద్ధం: కేటీఆర్ వార్నింగ్

KTR: గ్రూప్ 1, గ్రూప్ 2, మెగా డీఎస్సీలు ఇప్పటి వరకు లేవని చెప్పారు.

KTR: పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ సిద్ధం: కేటీఆర్ వార్నింగ్

KTR

కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చిన జాబ్ క్యాలెండర్ ఏమైందని తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ నిలదీశారు. గ్రూప్స్‌ ఎగ్జామ్స్‌ అభ్యర్థులతో కేటీఆర్‌ మాట్లాడారు. అనంతరం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ… గ్రూప్ 1, గ్రూప్ 2, మెగా డీఎస్సీలు ఇప్పటి వరకు లేవని చెప్పారు.

మొదటి ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగుల భర్తీ అన్నారని, ఇప్పటివరకు ఎన్ని భర్తీ చేశారని ప్రశ్నించారు. నిరుద్యోగుల తరఫున పోరాటానికి తాము సిద్ధమని చెప్పారు. ప్రభుత్వం స్పందించకపోతే నిరుద్యోగులకు అండగా ప్రత్యక్ష పోరాటానికి రెడీ అవుతామని హెచ్చరించారు.

మరోవైపు, సింగరేణి పరిధిలోని మాజీ ఎమ్మెల్యేలు, సింగరేణి ప్రాంత నాయకులతో తెలంగాణ భవన్‌లో కేటీఆర్ సమావేశమై మాట్లాడారు. సింగరేణిని ప్రైవేటీకరించేందుకే కేంద్రం తెలంగాణ బొగ్గు గనులను వేలం వేసిందని చెప్పారు. కేంద్ర సర్కారుతో రేవంత్ రెడ్డి కుమ్మక్కయి బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని అన్నారు.

లాభసాటిగా ఉన్న సింగరేణికి బొగ్గు గనులు కేటాయించకుండా నష్టాల్లోకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. అనంతరం సింగరేణి నష్టాల్లో ఉందంటూ పెట్టుబడుల ఉపసంహరణ కోసం సిద్ధం చేస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కయి నవ్వుకుంటూ సింగరేణి గనులను అమ్మకానికి పెట్టినట్లు ప్రతి సింగరేణి కార్మికుని అర్థమవుతోందని ఆరోపించారు.

Also Read: వరుస సమీక్షలతో బిజీబిజీ.. పాలనపై పట్టు పెంచుకుంటున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్