Viral Video : హైదరాబాద్‌కు డిస్నీ ల్యాండ్ తీసుకురండి.. చిన్నారి రిక్వెస్ట్‌కి కేటీఆర్ ఏం చెప్పారంటే?

హైదరాబాద్‌కు డిస్నీ లాండ్ తీసుకురండి.. అంటూ ఓ చిన్నారి చేసిన రిక్వెస్ట్ మంత్రి కేటీఆర్‌ను ఆకట్టుకుంది. అప్పుడు ఆయన ఏం సమాధానం చెప్పారంటే?

Viral Video : మంత్రి కేటీఆర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. నెటిజన్లు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇస్తుంటారు. తాజాగా ఓ చిన్నారి అడిగిన ప్రశ్న కేటీఆర్‌ను ఆకట్టుకుంది. వెంటనే ఆయన స్పందించారు.

ఇటీవల ‘కేటీఆర్ తాతకు ఓటేస్తానంటూ’ అనన్య అనే ఓ చిన్నారి తల్లితో మారాం చేస్తూ మాట్లాడిన ముద్దు మాటలు అందర్నీ ఆకట్టుకున్నాయి. తాజాగా మరో చిన్నారి మంత్రి కేటీఆర్‌ని ఒక రిక్వెస్ట్ చేసింది. ‘కేటీఆర్ మామా.. హైదరాబాద్‌కు డిస్నీ ల్యాండ్ తీసుకురా ప్లీజ్’ అంటూ ముద్దుగా అడుగుతున్న వీడియోను ఆమె తండ్రి సురేంద్ర వినాయకం (Surendra Vinayakam) ట్విట్టర్‌లో పోస్టు చేశారు. ఈ వీడియోపై మంత్రి కేటీఆర్ స్పందించారు. ‘ప్రామిస్ చేయలేను కానీ బేటా.. తీసుకువచ్చే ప్రయత్నం చేస్తాను’ అంటూ కేటీఆర్ ఆ చిన్నారికి రిప్లై ఇచ్చారు. ఈ పోస్టు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

డిస్నీ లాండ్ పిల్లలకు ఓ కలల ప్రపంచం. కాలిఫోర్నియాలో ఉంది. రెండు రకాల థీమ్ పార్కులలో ఉన్న డిస్నీ లాండ్ పిల్లల్ని ఎంతగానో ఆకట్టుకుంటుంది. అక్కడ పిల్లల కోసం ఎన్నో అట్రాక్షన్స్ ఉంటాయి. రకరకాల గేమ్స్,  రైడ్స్, షోలు, పెరేడ్లు ఉంటాయి. గుహలోంచి వెళ్లే రైలు, రంగుల రాట్నం, ఫైర్ వర్క్స్ ఇలా ఎన్నో.. కనిపించిన ప్రతీది పిల్లలకు నిజమనే భ్రాంతిలో ముంచేస్తుంది. పిల్లలు ఎంతగానో ఇష్టపడే డిస్నీ లాండ్ హైదరాబాద్‌కు తీసుకురమ్మని అడిగిన చిన్నారి కోరిక తీరుతుందేమో చూద్దాం.

ట్రెండింగ్ వార్తలు