KTR: 13న మేడిగడ్డ ప్రాజెక్ట్ సందర్శనకు రేవంత్ ప్రభుత్వ ఆహ్వానంపై కేటీఆర్ స్పందన

ఒకవేళ ఐఏఎస్‌ల మీద ఆరోపణలు వస్తే చర్యలు తీసుకోండని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో దొరికిన వ్యక్తని చెప్పారు.

BRS working president KTR

తెలంగాణలోని మేడిగడ్డ ప్రాజెక్ట్ సందర్శనకు ఈ నెల 13న రావాలంటూ కాంగ్రెస్ ప్రభుత్వం పలికిన ఆహ్వానంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను కట్టిందే గత బీఆర్ఎస్ ప్రభుత్వమని అన్నారు. ఆ ప్రాజెక్ట్‌ గురించి కాంగ్రెస్ పార్టీకి ఏమీ తెలియదని చెప్పారు.

అది ప్రపంచంలోనే అతి పెద్ద ప్రాజెక్ట్ అని కేటీఆర్ అన్నారు. చూడాలని అనుకుంటే కాంగ్రెస్ పార్టీ వాళ్లు వెళ్లి చూడొచ్చని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో ఒక మేడిగడ్డ మాత్రమే కుంగిందన్నారు. దాన్నే భూతద్దంలో పెట్టి చూపిస్తున్నారని తెలిపారు. సూర్యుడి మీద ఉమ్ము వేస్తే అది మన మొహం మీదనే పడుతుందని చెప్పారు.

కాళేశ్వరం ప్రాజెక్ట్ డెప్త్ కాంగ్రెస్ పార్టీ తెలుసుకుంటే మంచిదని కేటీఆర్ వ్యాఖ్యానించారు. కట్టిందే తామే కాబట్టి.. చూడాల్సింది కాంగ్రెస్ వాళ్లని చెప్పారు.

చిన్నలోపాలు ఉంటే ఎత్తి చూపాలని, అంతేగానీ దాన్ని రాజకీయం కోసం వాడుకోవడం ఏంటని కేటీఆర్ అన్నారు. తప్పు ఏదైనా జరిగితే బయట పెట్టాలని చెప్పారు. ఒకవేళ ఐఏఎస్‌ల మీద ఆరోపణలు వస్తే చర్యలు తీసుకోండని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో దొరికిన వ్యక్తని చెప్పారు.

AP Elections 2024: టీడీపీ-జనసేన అభ్యర్థుల ప్రకటన ఎప్పుడో తెలుసా?

ట్రెండింగ్ వార్తలు