KTR: నువ్వా అలా చేసేది..! సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్ పై చేసిన వ్యాఖ్యలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విటర్ వేదికగా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

KTR-Revanth Reddy

KTR strong counter to Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విటర్ వేదికగా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మంగళవారం సీఎం రేవంత్ మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఎక్స్‌పెయిరీ మెడిసిన్ అంటూ ఎద్దేవా చేసిన రేవంత్.. వన్ ఇయర్‌‌లో కొడుకుతో తండ్రిని రాజకీయంగా ఫినిష్ చేశామన్నారు. ఆ తర్వాత బావతో బామ్మర్దిని కూడా ఫినిష్ చేస్తాం. ఆపై హరీష్‌ను ఎలా డీల్ చేయాలో తనకు తెలుసునని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తాజాగా రేవంత్ వ్యాఖ్యలకు కేటీఆర్ ట్విటర్ వేదికగా స్పందించారు. చిట్టినాయుడు అంటూ రేవంత్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read: అనంతపురంలో ‘డిజిటల్ అరెస్ట్’.. రూ.72 లక్షలు పోగొట్టుకున్న రైల్వే ఉద్యోగి

నువ్వు చెప్పులు మోసిన నాడు ఆయన ఉద్యమానికి ఊపిరి పోశాడు.. నువ్వు పదవులకోసం పరితపిస్తున్న నాడు, ఆయన ఉన్న పదవిని తృణప్రాయంగా వదిలేశాడు. నువ్వు ఉద్యమకారుల మీద గన్ను ఎక్కుపెట్టిన నాడు, ఆయన ఉద్యమానికి తన ప్రాణాన్ని పణంగా పెట్టాడు.. సాధించుకున్న తెలంగాణను సంపెటందుకు నువ్వు బ్యాగులు మోస్తున్ననాడు, ఆయన తెలంగాణ భవిష్యత్ కు ఊపిరి పోశాడు.. చిట్టినాయుడు..! నువ్వా కేసీఆర్ పేరును తుచేది? తెలంగాణ చరిత్ర కేసీఆర్ అంటూ ట్విటర్ వేదికగా రేవంత్ వ్యాఖ్యలపై కేటీఆర్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.