అనంతపురంలో ‘డిజిటల్ అరెస్ట్’.. రూ.72 లక్షలు పోగొట్టుకున్న రైల్వే ఉద్యోగి

అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీ పరిధిలోని చంద్రప్రియ నగర్ కు చెందిన షేక్ మహమ్మద్ వలీ రైల్వే గార్డ్ గా పనిచేస్తున్నాడు.

అనంతపురంలో ‘డిజిటల్ అరెస్ట్’.. రూ.72 లక్షలు పోగొట్టుకున్న రైల్వే ఉద్యోగి

cyber criminals

Updated On : October 30, 2024 / 1:10 PM IST

Digital Arrest: సైబర్ నేరగాళ్లు ప్రజల సొమ్మును దోచుకునేందుకు కొత్తదారులు వెతుకుతున్నారు. ఈ క్రమంలో ఇటీవల కాలంగా డిజిటల్ అరెస్ట్ లు ఎక్కువయ్యాయి. ఇదే విషయాన్ని గత ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో ప్రస్తావించారు. కాస్త అప్రమత్తంగా ఉండి సైబర్ నేరగాళ్ల భారిన పడకుండా ఉండాలని సూచించారు. అయితే, తాజాగా ఇలాంటి ఘటన అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది. సైబర్ నేరగాళ్ల మాయలోపడి రైల్వే ఉద్యోగి రూ. 72లక్షలు పోగొట్టుకున్నాడు.

Also Read: Digital Arrest: ‘డిజిటల్ అరెస్ట్‌’ అంటే ఏమిటి.. ఈ మోసాలను గుర్తించడం ఎలా.. వాటి భారినపడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..

అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీ పరిధిలోని చంద్రప్రియ నగర్ కు చెందిన షేక్ మహమ్మద్ వలీ రైల్వే గార్డ్ గా పనిచేస్తున్నాడు. నాలుగు రోజుల క్రితం ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు, సీబీఐ అధికారులమని చెప్పి మహమ్మద్ వలీకి సైబర్ నేరగాళ్లు వీడియో కాల్ చేశారు. ముంబై బాంబు బ్లాస్ట్ ఘటనలో మీ పేరు ఉందని వలీని సైబర్ నేరగాళ్లు బెదిరించారు. వెంటనే నిన్ను అరెస్టు చేయకూడా ఉండాలంటే కొంత డబ్బు పంపాలని బెదిరించారు. పలు దపాలుగా మహమ్మద్ వలి నుంచి రూ. 72లక్షల సొమ్మును సైబర్ నేరగాళ్లు కొట్టేశారు. కూతుళ్ల పెళ్లిళ్లకోసం దాచిపెట్టుకున్న డబ్బులు సైబర్ నేరగాళ్లు దోచుకోవడంతో మహమ్మద్ వలి గుత్తి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

 

డిజిటల్ అరెస్ట్ మోసాల భారిన పడకుండా మూడు పద్దతులను అనుసరించాలని ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో పేర్కొన్నారు. మొదటగా ప్రశాంతంగా ఉండండి, భయపడవద్దు. వీలైతే స్క్రీన్ రికార్డ్ లేదా వీడియోను రికార్డ్ చేయాలి. రెండోది.. ప్రభుత్వానికి చెందిన ఏ దర్యాప్తు సంస్థ కూడా ఆన్ లైన్ ద్వారా బెదిరించరనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మూడోది.. నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నంబర్ కు లేదా పోలీసులకు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని ప్రధాని మోదీ తన సందేశంలో ప్రజలకు సూచించారు.