KTR : కేటీఆర్ కు తృటిలో తప్పిన ప్రమాదం

డ్రైవర్ సడెన్ బ్రేక్ వేయడంతో ప్రచార రథం గ్రిల్ ఊడిపోయింది. గ్రిల్ ఊడిపోవడంతో కేటీఆర్ కింద పడబోయారు. భద్రతా సిబ్బంది అప్రమత్తమై కేటీఆర్ ను పట్టుకోవడంతో ప్రమాదం తప్పింది.

KTR slipped and fell

KTR Slipped And Fell During Rally : నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ రోడ్ షోలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ర్యాలీలో అపశృతి చోటు చేసుకుంది. మంత్రి కేటీఆర్ కు తృటిలో ప్రమాదం తప్పింది. వాహనాన్ని ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో కేటీఆర్ కింద జారి పడిపోగా భద్రత సిబ్బంది అప్రమత్తమై పట్టుకున్నారు. దీంతో  కేటీఆర్ కు తృటిలో ప్రమాదం తప్పింది. కేటీఆర్ కు ఎలాంటి గాయాలు కాలేదు.

ఆర్మూర్  లో రోడ్ షో సందర్భంగా డ్రైవర్ సడెన్ బ్రేక్ వేయడంతో ప్రచార రథం గ్రిల్ ఊడిపోయింది. గ్రిల్ ఊడిపోవడంతో కేటీఆర్ కింద పడబోయారు. భద్రతా సిబ్బంది అప్రమత్తమై కేటీఆర్ ను పట్టుకోవడంతో ప్రమాదం తప్పింది. ఎలాంటి పెను ప్రమాదం జరుగకపోవడంతో పార్టీ నేతలు, శ్రేణులందరూ ఊపిరీ పీల్చుకున్నారు.

Kotha Prabhakar Reddy: అంబులెన్స్ లో వచ్చి నామినేషన్ దాఖలు చేసిన బీఆర్ఎస్ అభ్యర్ధి కొత్త ప్రభాకర్ రెడ్డి

అయితే రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేష్ రెడ్డి ర్యాలీ వాహనం నుండి కింద జారి పరిపోవడంతో తీవ్ర గాయాలు అయ్యాయి. కాగా, తన ఆరోగ్య పరిస్థితిపై ఎలాంటి ఆందోళన చెందవద్దని కేటీఆర్ తెలిపారు. ఈ కార్యక్రమం అనంతరం కొడంగల్ లో రోడ్ షోలో పాల్గొనేందుకు కేటీఆర్ బయలుదేరి వెళ్లారు.