KTR: ‘నేను చెబుతున్న విషయాన్ని రాసి పెట్టుకోండి’ అంటూ కేటీఆర్ సంచలన ట్వీట్

వారి చర్యలు తన విజన్‌ను మరుగునపర్చలేవని కేటీఆర్‌ అన్నారు. తనపై చేస్తున్న వ్యాఖ్యలు తనను మౌనం వహించేలా చేయలేవని తెలిపారు.

“నేను చెబుతున్న విషయాన్ని రాసి పెట్టుకోండి” అంటూ తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ సంచలన ట్వీట్ చేశారు. తన పునరాగమనం ఎదురుదెబ్బ కంటే శక్తిమంతంగా ఉంటుందని చెప్పుకొచ్చారు. అసత్యాలు తనను విచ్ఛిన్నం చేయలేవని అన్నారు. ఇతరులు చేస్తున్న వ్యాఖ్యలు తనను వెనక్కి తగ్గేలా చేయలేవని చెప్పారు.

వారి చర్యలు తన విజన్‌ను మరుగునపర్చలేవని కేటీఆర్‌ అన్నారు. తనపై చేస్తున్న వ్యాఖ్యలు తనను మౌనం వహించేలా చేయలేవని తెలిపారు. నేటి అడ్డంకులే రేపటి విజయానికి దారులు వేస్తాయన్నారు. సత్యం కాలంతో పాటు ప్రకాశిస్తుందని చెప్పారు. తనకు న్యాయవ్యవస్థపై గౌరవం ఉందని, న్యాయం గెలుస్తుందని తన అపార నమ్మకమని తెలిపారు. సత్యం కోసం తన పోరాటం కొనసాగుతుందని అన్నారు. త్వరలో ప్రపంచానికి ఈ విషయం తెలుస్తుందని తెలిపారు.

కాగా, తెలంగాణ హైకోర్టులో కేటీఆర్ కు ఎదురుదెబ్బ తగిలిన విషయం తెలిసిందే. ఫార్ములా ఈ-కారు రేసు కేసులో ఏసీబీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ ఆయన క్వాష్ పిటిషన్ దాఖలు చేయగా, దాన్ని హైకోర్టు కొట్టివేసింది. దీంతో కేటీఆర్‌ను అరెస్టు చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. దీంతో కేటీఆర్ చేసిన ట్వీట్‌ మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.

Delhi Assembly Elections 2025: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల.. ఫిబ్రవరి 5న పోలింగ్‌